Baselios Marthoma Paulose II : సిరియన్​ చర్చి సుప్రీం పాలోస్​-II కన్నుమూత..మోదీ,రాహుల్ సంతాపం

మలంకార ఆర్థోడాక్స్​ సిరియన్​ చర్చ్​ ఆఫ్​ ఇండియా సుప్రీం హెడ్ బసెలియోస్​ మార్తోమా పాలోస్​-II కన్నుముశారు.

Baselios Marthoma Paulose II మలంకార ఆర్థోడాక్స్​ సిరియన్​ చర్చ్​ ఆఫ్​ ఇండియా సుప్రీం హెడ్ బసెలియోస్​ మార్తోమా పాలోస్​-II కన్నుముశారు. 2019 డిసెంబర్ నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న బసెలియోస్(74) ఈ ఏడాది ఫిబ్రవరిలో కరోనా బారిన పడి కోలుకున్నారు.

అయితే కరోనా అనంతరం వచ్చే అనారోగ్య సమస్యలతో కేరళలోని పథనంతిట్టా జిల్లాలోని పారుమలలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం తెల్లవారుజామున 2:35గంటల సమయంలో బసెలియోస్ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆ చర్చి​ ప్రతినిధి ఒకరు తెలిపారు. బసెలియోస్​ మార్తోమా పాలోస్​-II మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ,కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

ఆగస్టు 30, 1946 న త్రిసూర్ జిల్లాలో కొల్లన్నూర్ ఐపే మరియు పులికోటిల్ కుంజీట్టి దంపతులకు జన్మించిన బసెలియోస్ మార్తోమా పాలోజ్ II పజాంజీలోని ప్రభుత్వ పాఠశాలలో మరియు తరువాత కేరళలోని సెయింట్ థామస్ కళాశాలలో చదువుకున్నాడు. 1969 లో, అతను తన వేదాంత అధ్యయనాల కోసం కొట్టాయం లోని ఆర్థడాక్స్ థియోలాజికల్ సెమినరీలో చేరాడు. అక్కడ అతను పాలోస్ గ్రెగోరియోస్, టి జె అబ్రహం మల్పన్ మరియు ఎన్ కె కొరుతు మల్పన్ మార్గదర్శకత్వంలో చదువుకున్నాడు. 2010లో మలంకార ఆర్థోడాక్స్​ సిరియన్​ చర్చ్​ ఆఫ్​ ఇండియా సుప్రీంగా బాధ్యతలు చేపట్టారు బసెలియోస్.

ట్రెండింగ్ వార్తలు