ప్రేమికుల రోజున ప్రేమించిన వారికి మనసులో మాట చెప్పడానికి ఆశగా ఎదురు చూసేవారు ఓ పక్క… ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామని బెదిరించే వారు మరోపక్క. ప్రేమికుల రోజున సాధరణంగా కనిపించే దృశ్యాలు ఇవి. వీటన్నింటికి భిన్నమైన ప్రదర్శన ఒకటి సూరత్‌లో జరగనుంది. 10 వేల మంది విద్యార్థుల చేత ‘పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకోము’ అని ప్రమాణం చేయించే కార్యక్రమం చేపట్టారు. హస్యమేవ జయతే అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
సంస్థ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘ప్రేమించడం, పెద్దలను ఎదిరించడం, పారిపోయి పెళ్లి చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. పెళ్లి చేసుకున్న వారు సంతోషంగా ఉంటే ఏ సమస్య లేదు. కొందరు పెళ్లయిన ఆరు నెలల లోపే విడాకుల తీసుకుంటున్నారు. ఎదిరించి పెళ్లి చేసుకున్నారనే కోపంతో తల్లిదండ్రులే దాడి చేయడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. విద్యార్థులతో ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకోమని’ ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. 12 పాఠశాలల నుంచి 10 వేలకు పైగా స్టూడెంట్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వెల్లడించారు.