Viral Audio: రహస్య భాగాలు కత్తిరిస్తానంటూ మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత

తమిళనాడులో ఇలా గతంలో పలుమార్లు జరిగాయి. అదే పార్టీకి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కేటీ రాఘవన్‭కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ మహిళా కార్యకర్తతో సన్నిహితంగా ఉన్న ఆ వీడియో కారణంగా అప్పట్లో పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ఆ వీడియోలో ఉన్న మహిళ ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా లేదని పార్టీ రాష్ట్ర చీఫ్ అన్నామళై ప్రకటించడం గమనార్హం.

Viral Audio: తమిళనాడు భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నేత, అదే పార్టీలోని మహిళా నేతపై అసభ్య పదజాలాన్ని ప్రయోగించారు. ఆమె జననాంగాలు కత్తిరిస్తానంటూ చేసిన ఆ కిరాతక వ్యాఖ్యల అనంతరం పార్టీ ఆయనపై ఆరు నెలలు వేటు వేసింది. పార్టీలోని ఏ విభాగంతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆయనకు ఆరు నెలల పాటు సంబంధం లేదని ప్రకటించింది.

పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి పేరు సురియా శివ. ఈయన తమిళనాడు బీజేపీ ఓబీసీ వింగ్ నేత. ఇక బాధితురాలు అదే పార్టీ మైనారిటీ విభాగానికి చెందిన నాయకురాలు. ఆమెతో సూరియా మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్ బయటికి లీకైంది. దీంతో విషయం బయటికి వెళ్లడైంది. ఆ రికార్డు ప్రకారం.. ఆమెపైకి గూండాలను పంపిస్తానని, అవసరమైతే చంపేస్తానని, ఆమె జననాంగాలను కత్తిరిస్తానంటూ చాలా అనుచితంగా, అసహ్యంగా మాట్లాడారు.

Ukraine vs Russia: ఉక్రెయిన్‭కు శాపంగా మారిన యుద్ధం.. 15,000 మందికి పైగా మిస్సింగ్

గురువారం ఇరు నేతలు పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. అనంతరం ఇద్దరి మధ్య సయోధ్య కుదిరి రాజీకి వచ్చినప్పటికీ, సూరియాపై ఆరు నెలల వేటు విధిస్తున్నట్లు తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నమళై ప్రకటించారు. సూరియాలో మార్పు వచ్చిందని గుర్తించిన రోజున, మళ్లీ పార్టీలోకి వస్తారని అన్నామళై అన్నారు.

తమిళనాడులో ఇలా గతంలో పలుమార్లు జరిగాయి. అదే పార్టీకి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కేటీ రాఘవన్‭కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ మహిళా కార్యకర్తతో సన్నిహితంగా ఉన్న ఆ వీడియో కారణంగా అప్పట్లో పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ఆ వీడియోలో ఉన్న మహిళ ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా లేదని పార్టీ రాష్ట్ర చీఫ్ అన్నామళై ప్రకటించడం గమనార్హం. ఇక డీఎంకేకు చెందిన సైదై సాదిక్ అనే నేత బీజేపీ నేత ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Gehlot vs Pilot: సచిన్ పైలట్‭ను పలుమార్లు ద్రోహి అంటూ విరుచుకుపడ్డ గెహ్లాట్.. కాంగ్రెస్ రియాక్షన్ ఏంటంటే?

ట్రెండింగ్ వార్తలు