Ukraine vs Russia: ఉక్రెయిన్‭కు శాపంగా మారిన యుద్ధం.. 15,000 మందికి పైగా మిస్సింగ్

ఎంత మంది వ్యక్తులు ఇక్కడి నుంచి బలవంతంగా వెళ్లారు? ఎంత మంది రష్యా నిర్బంధంలో ఉన్నారు? అందులో సజీవంగా ఉన్నవారెందరు? వారి కుటుంబ సభ్యుల నుండి విడిపోయారా? లేదంటే మరణించి సమాధులలో పూడ్చబడ్డారా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియదని అన్నారు

Ukraine vs Russia: ఉక్రెయిన్‭కు శాపంగా మారిన యుద్ధం.. 15,000 మందికి పైగా మిస్సింగ్

More than 15,000 people missing in war in Ukraine

Ukraine vs Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‭లో 15,000 మందికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారని ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ మిస్సింగ్ పర్సన్స్ (ఐసీఎంపీ) గురువారం తెలిపింది. 1990లో బాల్కన్ యుద్ధాల నేపథ్యంలో ఏర్పడిన హేగ్ అనే సంస్థ, తప్పిపోయిన వ్యక్తులను డాక్యుమెంట్ చేయడంతో పాటు వారి జాడ తెలియజేయడానికి సహాయం చేస్తుంది. తాజా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు సహాయం చేయడానికి జూలైలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో తన కార్యాలయాన్ని ప్రారంభించింది.

ఈ విషయమై ఐసీఎంపీ ప్రోగ్రామ్ డైరెక్టర్, మాథ్యూ హాలిడే మాట్లాడుతూ, ఎంత మంది వ్యక్తులు ఇక్కడి నుంచి బలవంతంగా వెళ్లారు? ఎంత మంది రష్యా నిర్బంధంలో ఉన్నారు? అందులో సజీవంగా ఉన్నవారెందరు? వారి కుటుంబ సభ్యుల నుండి విడిపోయారా? లేదంటే మరణించి సమాధులలో పూడ్చబడ్డారా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియదని అన్నారు. ఉక్రెయిన్‌లో తప్పిపోయిన వారి కోసం వెతికే ప్రక్రియ యుద్ధం అనంతరం కూడా చాలా సంవత్సరాలు పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు.

Indian Nurse: ఆస్ట్రేలియాలో మహిళను హత్య చేసిన భారతీయుడు ఢిల్లీలో అరెస్ట్.. నిందితుడిపై ఐదు కోట్ల బహుమతి

ఒకవైపేమో కేవలం మారియుపోల్‌లోనే దాదాపు 25,000 మంది చనిపోయారని లేదంటే తప్పిపోయారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశం మొత్తంలో 15,000 మంది తప్పిపోయారనేది చాలా తక్కువ నంబర్ అని అంటున్నారు. “బహుశా ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఉక్రెయిన్ ఎదుర్కొనే సవాళ్లు సైతం భారీగానే ఉన్నాయి. వీటన్నటికీ తోడు రష్యన్ ఫెడరేషన్‌కి వ్యతిరేకంగా కొనసాగుతున్న యుద్ధంలో ఇంకా పోరాడుతూనే ఉన్నారు” అని హాలిడే చెప్పారు.

‘‘ఇప్పుడు కీలకం ఏమిటంటే, చాలా మంది వ్యక్తులను గుర్తించగలిగేలా అన్ని సరైన చర్యలను ఏర్పాటు చేయడం. తప్పిపోయిన వ్యక్తులలో అత్యధికులు ఇప్పటికే మరణించి ఉంటారు. మిగిలిన వారిలో కొందరు యుద్ధ నేరాల బాధితులుగా మిగిలి ఉంటారు. అందరినీ గుర్తించాలి’’ అని హాలీడే అన్నారు. క్షిపణి దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. పౌర సమాజంపై సదుపాయాలపై వైమానిక దాడులు చేస్తున్న రష్యాను శిక్షించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఐక్యరాజ్యసమితి వేదికగా డిమాండ్ చేశారు. అనంతరమే హాలిడే మాట్లాడారు.

Supreme court : CECగా అరుణ్‌ గోయల్‌ నియామకం.. ఏ ప్రాతిపదికన నియమించారో తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం