Indian Nurse: ఆస్ట్రేలియాలో మహిళను హత్య చేసిన భారతీయుడు ఢిల్లీలో అరెస్ట్.. నిందితుడిపై ఐదు కోట్ల బహుమతి

ఆస్ట్రేలియాలో పని చేస్తూ, అక్కడి మహిళను హత్య చేసిన భారతీయుడిని తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగేళ్ల క్రితం హత్యకు పాల్పడ్డ నిందితుడు, ఇండియా పారిపోయి వచ్చేశాడు. భార్య, పిల్లల్ని అక్కడే వదిలేశాడు.

Indian Nurse: ఆస్ట్రేలియాలో మహిళను హత్య చేసిన భారతీయుడు ఢిల్లీలో అరెస్ట్.. నిందితుడిపై ఐదు కోట్ల బహుమతి

Indian Nurse: ఆస్ట్రేలియాలో మహిళను హత్య చేసిన భారతీయుడిని తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని పట్టిస్తే మన కరెన్సీలో ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని ఆస్ట్రేలియా పోలీసులు గతంలో ప్రకటించారు.

Arvind Kejriwal: సీబీఐ, ఈడీ నా చేతిలో ఒక్క రోజు ఉన్నా.. సగం మంది బీజేపీ నేతలు జైలుకే: అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్, అమృత్‌సర్‌కు చెందిన రజ్విందర్ సింగ్ ఆస్ట్రేలియాలో నర్స్‌గా పని చేస్తూ కుటుంబంతో కలిసి ఉండేవాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2018, అక్టోబర్ 21న రజ్విందర్.. తోయా కార్డింగ్లే అనే ఆస్ట్రేలియా మహిళను హత్య చేశాడు. అక్కడి క్వీన్స్‌ల్యాండ్ బీచులో ఆమెను హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి ఇండియా వచ్చేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు రజ్విందర్ సింగ్‌ను నిందితుడిగా గుర్తించారు. అయితే, అతడు అప్పటికే ఇండియా వచ్చి ఉండటంతో పోలీసులకు దొరకలేదు. దీంతో అతడిని పట్టిస్తే, మన కరెన్సీలో దాదాపు ఐదు కోట్ల రూపాయలకు పైగా బహుమతి ఇస్తామని అక్కడి పోలీసులు ప్రకటించారు.

Bihar: చాక్లెట్ల ఆశచూపి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి 5 గుంజీల శిక్షతో సరిపెట్టిన గ్రామ పెద్దలు

కాగా, నిందితుడు తన భార్య, పిల్లల్ని అక్కడే వదిలేసి ఇండియా వచ్చేశాడు. అతడి కోసం ఇండియన్ పోలీసులతోపాటు, ఆస్ట్రేలియా పోలీసులు కూడా వెతుకుతున్నారు. తాజాగా అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఆస్ట్రేలియా పోలీసులకు సమాచారం అందించారు. క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు ఇంత భారీ బహుమతి ప్రకటించడం ఇదే మొదటిసారి.