Gehlot vs Pilot: సచిన్ పైలట్‭ను పలుమార్లు ద్రోహి అంటూ విరుచుకుపడ్డ గెహ్లాట్.. కాంగ్రెస్ రియాక్షన్ ఏంటంటే?

పైలట్ తిరుగుబాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. అమిత్ షాతో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని పైలట్ ప్రయత్నించారని, పైలట్ ద్రోహని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంటర్వ్యూ కొనసాగుతున్నంత సేపు పలుమార్లు పైలట్ ద్రోహి అంటూ గెహ్లాట్ వ్యాఖ్యానించడం గమనార్హం. ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, అధిష్టానం ఇలాంటి ద్రోహుల్ని ముఖ్యమంత్రి చేయదని ఆయన అన్నారు

Gehlot vs Pilot: సచిన్ పైలట్‭ను పలుమార్లు ద్రోహి అంటూ విరుచుకుపడ్డ గెహ్లాట్.. కాంగ్రెస్ రియాక్షన్ ఏంటంటే?

After Ashok Gehlot's 'Gaddar' Remark In NDTV Interview, Congress Reacts

Gehlot vs Pilot: గురువారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‭ను ద్రోహి అని పలుమార్లు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. పైలట్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు, ఆయనను ఎవరూ ముఖ్యమంత్రి చేయలేరంటూ తన అక్కసును బహిరంగంగానే మరోసారి వెల్లగక్కారు. కాగా, గెహ్లాట్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని, కుటుంబంలో వచ్చే గొడవలాంటివని, వీటిని తొందర్లోనే పరిష్కరించుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు.

‘‘ఇంటర్వ్యూలో వాడిన కొన్ని పదాలను అసలు ఊహించలేదు. చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు కూడా. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకత్వం చూసుకుంటుంది. మేమంతా ఒక కుటుంబం. ఇది మా అంతర్గత సమస్య. దీన్ని మేమే పరిష్కరించుకుంటాం. చాలా సీనియారిటీ ఉన్న గెహ్లాట్, అలాగే డైనమిక్ లీడర్ అయిన పైలట్‭లను కాంగ్రెస్ పార్టీ ఓదులుకోదు. వారి మధ్య ఏం విబేధాలు ఉన్నాయో వాటికి తొందర్లోనే పరిష్కారం దొరుకుతుంది’’ అని జైరాం రమేష్ అన్నారు.

Amitabh Bachchan : తన ఇమేజ్‌ని వాడుకుంటున్నారు అంటూ.. కోర్ట్‌ని ఆశ్రయించిన అమితాబ్..

పైలట్ తిరుగుబాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. అమిత్ షాతో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని పైలట్ ప్రయత్నించారని, పైలట్ ద్రోహని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంటర్వ్యూ కొనసాగుతున్నంత సేపు పలుమార్లు పైలట్ ద్రోహి అంటూ గెహ్లాట్ వ్యాఖ్యానించడం గమనార్హం. ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, అధిష్టానం ఇలాంటి ద్రోహుల్ని ముఖ్యమంత్రి చేయదని ఆయన అన్నారు. పైలట్ వద్ద 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని, అతడు పార్టీని నాశనం చేయాలనుకున్న తిరుగుబాటుదారుడని విమర్శించారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడిగా పైలట్ ఉన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే పైలట్ ముఖ్యమంత్రి అవుతారనే చర్చ కూడా జరిగింది. కానీ అందుకు విరుద్ధంగా సీనియర్ నేత, మాజీ సీఎం గెహ్లాట్‭నే ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది.

Ukraine vs Russia: ఉక్రెయిన్‭కు శాపంగా మారిన యుద్ధం.. 15,000 మందికి పైగా మిస్సింగ్