CM MK Stalin : కుమారుడు ఉదయనిధి ‘సనాతన’వ్యాఖ్యలపై నోరు విప్పిన సీఎం స్టాలిన్ .. వాస్తవాలు తెలుసుకోవాలంటూ ప్రధానికి కౌంటర్

సనాతన ధర్మంపై కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మౌనం వీడారు. ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

PM Modi, CM stalin.. udhayanidhi stalin

Sanatan Dharma Row MK Stalin :  సనాతన ధర్మం(Sanatan Dharma )పై తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ (udhayanidhi stalin)చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా చల్లారలేదు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతునే ఉన్నారు. ఉదయనిధి తల నరికితే రూ.10కోట్లు ఇస్తానని ఓ స్వామీజీ..ఉదయనిధిని చెంపదెబ్బ కొడితే రూ.10లక్షలు ఇస్తానంటూ పోస్టర్ వేసి మరీ ప్రకటించింది జన జాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ. అలాగే ప్రధాని నరేంద్రమోదీ (PM narendra modi)కూడా సనాతన ధర్మంపై సరైనరీతిలో సమాధానం చెప్పాలని..చరిత్ర లోతుపాతుల్లోకి వెళ్లకుండా రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ధీటుగా బదులివ్వాలని తమ మంత్రులకు సూచించారు.

ఇలా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ ఆయన తండ్రి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ( MK Stalin)ఎట్టకేలకు స్పందించారు. అలాగే ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై మోదీ తన మంత్రులకు ఇచ్చిన సూచనలపై స్టాలిన్ స్పందిస్తు..”ఉదయనిధి ఏం మాట్లాడారో తెలియకుండా ప్రధాని వ్యాఖ్యలు చేయడం అన్యాయం” అని అన్నారు. సనాతన ధర్మం సామాజిక న్యాయ భావనకు విరుద్ధంగా ఉందని, దానిని తొలగించాలి అంటూ చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతికేత వచ్చింది.బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఉదయనిధిపై తీవ్రంగా మండిపడుతున్నాయి. తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Sanatana Remark : ఉదయనిధి స్టాలిన్‌ను చెప్పుతో కొడితే రూ.10 లక్షల బహుమానం : హిందూ సంస్థ పోస్టర్

ఇదిలా ఉంటే కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు సీఎం ఎంకే స్టాలిన్ మౌనం వీడారు. ఉదయనిధి ‘సనాతన ధర్మం’ గురించి ఏం మాట్లాడారో తెలియకుండా ప్రధాని వ్యాఖ్యలు చేయడం అన్యాయం అని అన్నారు. ఉదయనిధిపై వస్తున్న విమర్శలను తప్పుడు కథనాలు అంటూ వివరించారు. అణిచివేత గురించి ఉదయనిధి మాట్లాడిన మాటలను బీజేపీ అనుకూల శక్తులు సహించలేక తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని..ఉదయనిధి మారణహోమానికి పిలుపునిచ్చారని తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నారంటూ ఆరోపించారు.

బీజేపీ సోషల్ మీడియా విభాగం ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేస్తోందని.. ఉదయనిధి తమిళంలో కానీ ఇంగ్లీషులో కానీ ”జాతి హత్య” అనే పదాన్ని వినియోగించలేదని.. కానీ బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు యూపీకి చెందిన ఓ జ్ఞాని (సాధువు) తన కుమారుడి తలపై బహుమతి ప్రకటించారని మరి ఆ సాధువుపై యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందా..? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ ఉదయనిధి వ్యాఖ్యలపై సరైన స్పందన అవసరమని పేర్కొడం తనను నిరుత్సాహపరిచిందని స్టాలిన్ అన్నారు.

ఏ విషయంపైనా అయినా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అంతే తప్ప దృవీకరించుకుని మాట్లాడితే మంచిదని సూచించారు. తెలిసిన విషయాన్ని ధృవీకరించుకోవడానికి ప్రధాన మంత్రికి అన్ని వెసులుబాట్లు ఉన్నాయని కానీ మోదీ మాత్రం ఉదయనిధి గురించి తప్పుగా చేయబడుతున్న ప్రచారం నిజమా..? కాదా అని తెలుసుకోకుండా వ్యాఖ్యానించటం సరికాదు అంటూ సూచించారు. ఈ విషయం గురించి ప్రధానికి తెలిసి మాట్లాడుతున్నారా..? తెలియక మాట్లాడుతున్నారా..? అని ప్రశ్నించారు స్టాలిన్.

ఈ సందర్భంగా స్టాలిన్ ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ గురించి కూడా స్పందిస్తు ఇదో రాజకీయ జిమ్మిక్కు అంటూకొట్టిపారేశారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ప్రతిపక్ష కూటమిలో విభేదాలు సృష్టించటానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. సనాతన వివక్ష పట్ల బీజేపీకి పట్టింపు లేదని అన్నారు స్టాలిన్. డీఎంకే లాంటి పార్టీ ప్రతిష్టను దిగజార్చాలని యత్నిస్తే బీజేపీ ఊబిలో మునిగిపోయినట్లేనని అన్నారు.

Sanatana Dharma Row: సనాతన ధర్మ వివాదంపై దూకుడు పెంచిన డీఎంకే నేతలు.. హెచ్ఐవీ, కుష్ఠురోగమంటూ విరుచుకుపడ్డ ఎంపీ ఏ.రాజా

సనాతన ధర్మం గురించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు మద్ధతు ఇచ్చారు. “కొందరు వ్యక్తులు ఇప్పటికీ ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తారు. వితంతువులు పునర్వివాహం చేసుకోకూడదని వాదిస్తున్నారు. పునర్వివాహం కోసం ఎటువంటి ఆచారాలు లేదా మంత్రాలు లేవు. మానవజాతిలో సగానికి పైగా ఉన్న స్త్రీలపై అణచివేతను కొనసాగించడానికి వారు ‘సనాతన’ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అటువంటి అణచివేత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాత్రమే ఉదయనిధి మాట్లాడాడు. ఆ సిద్ధాంతాలపై ఆధారపడిన పద్ధతులను నిర్మూలించాలని పిలుపునిచ్చారు’’అని అన్నారు.