Mk Stalin's Postman Jab At Tamil Nadu Governor
CM Stalin : గవర్నర్ పై సెటైర్ వేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఎద్దేవా చేస్తున్నట్లే మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి తనదైన శైలిలో విమర్శకులతో కూడా ప్రశంసలు పొందే సీఎం MK స్టాలిన్ ఓ బిల్లు అనుమతి విషయంలో గవర్నర్ RN రవిపై కాస్త కటువుగానే మాట్లాడారు. ‘గవర్నర్ ను జస్ట్ పోస్ట్ మ్యాన్ పని చేయంటున్నాం అంతే ’అంటూ వ్యాఖ్యానించారు.
Also read : KA Paul On Telangana : తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే-కేఏ పాల్ హాట్ కామెంట్స్
నీట్ బిల్లు విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ గవర్నర్ రవిపై మరోసారి అసహనం వ్యక్తం చేసిన క్రమంలో ‘నీట్ బిల్లు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరడం లేదని..ఓ పోస్ట్‌మ్యాన్ లాగా దానిని రాష్ట్రపతి అనుమతి కోసం పంపాలనే తాము డిమాండ్ చేస్తున్నామని సీఎం కటువుగా వ్యాఖ్యానించారు.
నీట్ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని అసెంబ్లీ ఆమోదించిన రెండో బిల్లుకు ఆమోదం తెలిపే అధికారం గవర్నర్‌కు లేదని సీఎం అన్నారు. సోమవారం డీఎంకే ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని నీట్ నుంచి మినహాయించాలన్న విషయంలో తాము చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also read : delhi high court: ఫలించిన తెలంగాణ దంపతుల పోరాటం.. కుమార్తెను కలిసేందుకు అనుమతి
తమిళనాడుకు జాతీయ ప్రవేశ కమ్-అర్హత పరీక్ష (నీట్) బిల్లుకు ఆమోదం తెలపాలని తాము గవర్నర్‌ను కోరడం లేదు. అలా చేయడానికి గవర్నర్‌కు అధికారం కూడా లేదు. ఈ బిల్లును రాష్ట్రపతికి పంపమని మాత్రమే కోరుతున్నాం. మేం అడిగేది అదే అంటూ సీఎం స్టాలిన్ అన్నారు.