KA Paul On Telangana : తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే..నేనే..నేనే-కేఏ పాల్ హాట్ కామెంట్స్

వందలు, వేల మంది బిలియనీర్లను నేను తీసుకొచ్చి తెలంగాణను డెవలప్ చేశానని కేఏ పాల్ వివరించారు. జార్జిబుష్ ని, బిల్ క్లింటన్ ని హైదరాబాద్ కు తీసుకొచ్చింది నేనే అన్నారు.

KA Paul On Telangana : తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే..నేనే..నేనే-కేఏ పాల్ హాట్ కామెంట్స్

Ka Paul On Telangana

KA Paul On Telangana : తెలంగాణ అభివృద్ధి గురించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే అని కేఏ పాల్ బల్లగుద్ది మరీ చెప్పారు. సీఎం కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్ పుట్టక ముందు 40 సంవత్సరాలలో తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే అని కేఏ పాల్ అన్నారు. అప్పుడు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నా దగ్గరికి వచ్చారని చెప్పారు. వందలు, వేల మంది బిలియనీర్లను నేను తీసుకొచ్చి తెలంగాణను డెవలప్ చేశానని కేఏ పాల్ వివరించారు.

అసలు.. కేసీఆర్, కేటీఆర్ లు.. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ పేర్లు అయినా విన్నారా? అని కేఏ పాల్ అడిగారు. తెలంగాణను అభివృద్ది చేసింది తానే అన్నారు. సంగారెడ్డిలో 1200 ఎకరాల్లో ఉచిత చారిటీ సిటీ పెట్టి హైదరాబాద్ అమీర్ పేట్ లో 53వేల మంది అనాథలు, వితంతవులకు నేను సపోర్ట్ చేశాను అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తానే అని అందరికీ తెలుసు అన్నారు కేఏ పాల్. ఇప్పుడు 20, 30 సంవత్సరాల వయసున్న పిల్లలకు ఆ విషయం తెలియకపోవచ్చన్నారు. గూగుల్ చేస్తే తెలుస్తుందన్నారు.(KA Paul On Telangana)

KA Paul : బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ : కేఏ పాల్

జార్జిబుష్ ని, బిల్ క్లింటన్ ని హైదరాబాద్ కు తీసుకొచ్చింది నేనే అన్నారు. అప్పుడు కేసీఆర్ పొలిటికల్ గా పుట్టారా? అని పాల్ అడిగారు. ఏదో టీడీపీలో పార్టీలో ఒక సేవకుడిగా ఉన్నారు అని చెప్పారు. తాను ఇంత అభివృద్ధి చేసిన తెలంగాణను… నేడు అవినీతిమయంగా మార్చేశారని, అప్పుల రాష్ట్రంగా మార్చారని పాల్ వాపోయారు. తెలంగాణ అప్పులు 4లక్షల 12 కోట్లు అని చెప్పారు. 20లక్షల కోట్ల ఆదాయం ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల తెలంగాణగా ఎలా మారింది? అని కేఏ పాల్ ప్రశ్నించారు. దీనిపై ప్రజలు ఆలోచన చేయాలని, ముందుకు రావాలని పాల్ పిలుపునిచ్చారు.

కాగా, టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు నిబంధనలను ఉల్లంఘించారని, నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని డీజీపీ, నగర పోలీస్ కమిషనర్లను డిమాండ్ చేశారు కేఏ పాల్. నగరంలో అడ్డంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పీకి పడేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేఏ పాల్. తాను నీతి కోసం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం ఫైట్ చేస్తానని కేఏ పాల్ అన్నారు. అవినీతితో రాష్ట్రాలను, దేశాన్ని దోచుకుంటుంటే, చట్టాలను ఉల్లంఘిస్తుంటే ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా అని కేఏ పాల్ అన్నారు. తాను వచ్చింది అవినీతిని నిర్మూలించడానికి, అభివృద్ధి చేయడానికి అని కేఏ పాల్ తేల్చి చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి అని చెప్పారు కేఏ పాల్.