KA Paul : బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ : కేఏ పాల్

ఏ సీఎం దగ్గరైనా నేను ఒక్కరూపాయి తీసుకోలేదన్నారు. అందరు ముఖ్యమంత్రులకు తానే ఇచ్చానని తెలిపారు. త్వరలో ఏపీ, తెలంగాణలో పాదయాత్ర చేస్తానని చెప్పారు.

KA Paul : బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ : కేఏ పాల్

Paul

KA Paul criticised BJP : బీజేపీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విమర్శలు చేశారు. బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ అని విమర్శించారు. దేశంలో మోదీ విఫలమయ్యారని.. బండి సంజయ్ ఏం చేస్తారని పేర్కొన్నారు. మోదీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని.. ఇవ్వలేదన్నారు. ఉద్యోగాలు రాకపోగా 25 కోట్ల ఉద్యోగాలు పోయాయని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదన్నారు.

అలాగే టీఆర్ఎస్ పై కూడా విమర్శలు చేశారు. కేంద్రంలో బీజేపీ సరిగ్గా పని చేయడం లేదని..ఇక్కడ మీరు పని చేయరా అని నిలదీశారు. ఎందుకు ప్రశాంత్ కిషోర్..టీఆర్ఎస్ ను విడిచి పెట్టారో కేసీఆర్ చెప్పాలన్నారు. ప్రజల్ల్ టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉందన్నారు. 8 లక్షల కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ 23 లక్షల కోట్లు హ్యాండిల్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ డిబెట్ కు రావాలన్నారు.

KA Paul: హల్‌చల్ చేస్తున్న కేఏ పాల్ స్టేట్‌మెంట్‌

తెలంగాణలో రిలయ్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయిందని విమర్శించారు. ఏ సీఎం దగ్గరైనా నేను ఒక్కరూపాయి తీసుకోలేదన్నారు. అందరు ముఖ్యమంత్రులకు తానే ఇచ్చానని తెలిపారు. త్వరలో ఏపీ, తెలంగాణలో పాదయాత్ర చేస్తానని చెప్పారు.

నిరుద్యోగ సమస్య ఎక్కువైందన్నారు. ఉచిత వైద్యం, విద్య లేదని విమర్శించారు. రాజకీయాలంటే తిట్టుకోవడమేనా అని అన్నారు. ప్రజా సమస్యలపై డిబేట్ పెట్టాలని చెప్పారు. ఇప్పుడున్న ప్రతి పార్టీ అవినీతి పార్టీలే అని తేల్చి చెప్పారు.