రికార్డ్ బ్రేక్ : 58 నిమిషాల్లో 46 వంటకాలు తయారు చేసిన చిన్నారి

రికార్డ్ బ్రేక్ :  58 నిమిషాల్లో 46 వంటకాలు తయారు చేసిన చిన్నారి

Updated On : December 16, 2020 / 11:45 AM IST

Tamil Nadu Girl Creates World Record By Cooking 46 Dishes In 58 Minutes : లాక్ డౌన్ లో స్కూల్స్ లేని చిన్నారులు ఫోన్లుల్లో ఆటలు, టీవీ చూడటం,ఆడుకోవటం చేసేవారు. ఇప్పుడు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కావటంతో కొంతసేపు క్లాసులు వింటూ మరికొంతసేపు ఆడుకుంటూ కాలం గడిపేస్తున్నారు. కానీ ఓ చిన్నారికి మాత్రం లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తల్లిదగ్గర వంటలు నేర్చుకుంది. ఆ వంటలతో రికార్డు సాధించేసింది.

వివరాల్లోకి వెళితే..తమిళనాడుకు చెందిన ఎస్.ఎన్. లక్ష్మి సాయి శ్రీ అనే చిన్నారి 58 నిమిషాల్లో 46 వంటకాలు తయారుచేసి యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకని.. తన తల్లి దగ్గర వంట నేర్చుకుంది లక్ష్మీసాయి. తాను వంట చేస్తుంటే ఎంతో ఆసక్తిగా గమనించే కూతురి అభిరుచి తెలుసుకున్న సాయి శ్రీ తల్లి కలైమగల్ ‘‘ఏంటీ అలా చూస్తున్నావ్? అని అడిగింది.

దానికి ఆ చిన్నారి ‘‘అమ్మా నాక్కూడా వంట చేయటం నేర్పించవా? అని అడిగింది. నువ్వు చిన్నపిల్లవురా..ఇప్పటినుంచి నీకెందుకివన్నీ..హాయిగా ఆడుకోమని చెప్పింది.దానికి సాయి లేదు నేను నేర్చుకుంటానని మారాం చేయటంతో తండ్రి కూడా మంచి వంటకారి కావటంతో సాయిశ్రీకి ఇద్దరూ కలిసి వంటకాలు చేయటం నేర్పించారు. చాలా త్వరగా నేర్చుకుంది సాయి శ్రీ.

ఇలా నేర్చేసుకుని అలా వంటలు పర్ ఫెక్ట్ గా తయారు చేసేయటం చూసిన ఆ పాప తండ్రి కూతురికి ఉన్న ఆ వంటల హాబీతో రికార్డు సృష్టించాలని అనుకున్నాడు. ఈ రికార్డు గురించి పాప తండ్రి గతంలో ఇటువంటి రికార్డులు ఎవరైనా చేసి ఉన్నారా? అని సెర్చ్ చేసి చూశాడు.

కేరళకు చెందిన 10ఏళ్ల సాన్వి సుమారు 30 వంటలు వండి.. రికార్డు క్రియేట్ చేసినట్లుగా గుర్తించాడు. ఆ రికార్డును తన కూతురు లక్ష్మి సాయి చేత బ్రేక్ చేయించాలని తండ్రి అనుకున్నాడు. ఆ తరువాత ఎలాగూ కూతురికి ఉన్న ఇంట్రెస్ట్ తో తను, తన భార్య కలిసి కూతురుకి వంట చేయించటం నేర్పించాడు. వంటలు చేయటంలో మెళకువలు కూడా నేర్పించారు.

సాయి శ్రీ ఫాస్ట్‌గా వంట చేయడం నేర్చుకుంది. అనంతరం మంగళవారం (డిసెంబర్ 15,2020)యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ ప్రతినిధుల సమక్షంలో లక్ష్మి సాయి 58 నిమిషాల్లో 46 వంటకాలు చేసి రికార్డు బ్రేక్ చేసింది.

ప్రపంచ రికార్డు సృష్టించిన సందర్భంగా చిన్నారి లక్ష్మి సాయి శ్రీ మాట్లాడుతూ.. తాను తన తల్లిని చూసి వంట పట్ల ఆసక్తి పెంచుకున్నానని..నేను ఈ రికార్డు సాధించటనాకి కారణం నాకు వంట నేర్పిని నా తల్లిదండ్రులు..అనీ చెప్పింది. ఈ రికార్డు సాధించినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందని తెలిపింది.

లాక్డౌన్ సమయంలో తన కూతురు వంట చేయడం నేర్చుకుందనీ లక్ష్మి తల్లి కలైమగల్ తెలిపారు. పాప బాగా వంట చేస్తుండటంతో.. లక్ష్మి చేత ప్రపంచ రికార్డు సృష్టించే ప్రయత్నం చేద్దామని తన భర్త ఆలోచనతో ఇలా చేశామని తమ నమ్మకాన్ని తనకూతురు నిలబెట్టి రికార్డు సాధించిందని తెలిపారు.

‘నేను తమిళనాడులోని విభిన్న సాంప్రదాయ వంటకాలను వండుతుంటాను. లాక్డౌన్ సమయంలో.. నా కుమార్తె నాతో పాటు వంటగదిలోనే ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో తనకు వంట చేయటంలో గల ఆసక్తిని గుర్తించి వంట నేర్పిచానని తెలిపింది. పాపకున్న ఆసక్తి గురించి నా భర్తతో చెప్పగా లక్ష్మి చేత ప్రపంచ రికార్డులో ప్రయత్నం చేద్దామని అన్నారని..అదే జరిగిందని కలైమగల్ తెలిపారు.