IUML – TVK Vijay: 118 కాదు 120.. మరింత పెరిగిన టీవీకే బలం.. విజయ్ కి ఆ పార్టీ కూడా మద్దతు..
ఇప్పటికే కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ టీవీకేకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీసీకే సైతం తన సపోర్ట్ ను ఇచ్చింది. దీంతో ఉత్కంఠకు తెర పడింది.
IUML – TVK Vijay: టీవీకే బలం మరింతగా పెరిగింది. టీవీకేకు ఐయుఎంఎల్ (ఇండియన్ యునియన్ ముస్లిం లీగ్) పార్టీ కూడా మద్దతు తెలిపింది. IUML కు రెండు సీట్ల బలం ఉంది. వారి మద్దతు కూడా టీవీకేకి లభించడంతో టీవీకే సంఖ్యా బలం 118 నుంచి 120కి చేరింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 118. ఆ సంఖ్యను దాటి టీవీకే సంఖ్యా బలం మరింతగా పెరిగింది.
అసలు టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను (118) అందుకుంటుందా లేదా అనే ఉత్కంఠ నిన్నటి వరకు కనిపించింది. వీసీకే పార్టీ నిర్ణయం కోసం అంతా ఎదురుచూశారు. ఉత్కంఠకు తెరదించుతూ వీసీకే ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. టీవీకేకి సంపూర్ణ మద్దతును ప్రకటించింది వీసీకే. దాంతో టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆ కాసేపటికే ఐయుఎంఎల్ సైతం విజయ్ కు గుడ్ న్యూస్ చెప్పింది. టీవీకేకి తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దాంతో విజయ్ మెజారిటీ 118 నుంచి 120కి పెరిగింది.
వామపక్షాలు ఏమీ ఆశించకుండానే విజయ్ పార్టీకి మద్దతు తెలిపాయి. ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం కావడం లేదని కూడా తేల్చి చెప్పాయి. మంత్రివర్గంలో రెండు బెర్తులు ఇస్తామని వామపక్షాలకు విజయ్ ఆఫర్ ఇచ్చారు. కానీ, సీపీఎం సీపీఐ ఆ ఆఫర్ ను తిరస్కరించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాడాలని కోరుకున్నాయి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ మేము టీవీకేకి మద్దతు ఇస్తున్నాము తప్ప మాకు ఎలాంటి మంత్రి పదవులు వద్దని తేల్చి చెప్పేశాయి. ఐదుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి రెండు మంత్రి పదవులు ఖరారయ్యాయి. తమకు డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలని వీసీకే నేత గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరో శాఖ ఇస్తామని విజయ్ చెప్పినా వీసీకే నేత అందుకు ఒప్పుకోలేదు. డిప్యూటీ సీఎం పోస్ట్ కోసం వీసీకే నేత తిరుమావళవన్ గట్టిగా పట్టుబట్టారని, అందుకు విజయ్ కూడా అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. అయితే, తిరుమావళవన్ ఎమ్మెల్యేగా గెలవలేదు.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు..
టీవీకే – 107
కాంగ్రెస్ – 5
సీపీఐ – 2
సీపీఎం – 2
వీసీకే – 2
ఐయుఎంఎల్ – 2
Also Read: సువేందు ప్రమాణస్వీకారంలో అందరి ముందు ఈ పెద్దాయన కాళ్లు మొక్కిన పీఎం మోదీ.. ఎవరీయన?
