ఓ వ్యక్తి రయ్యి రయ్యి మంటూ దూసుకొచ్చాడు. చేతికి గ్లౌజ్‌లు, హెల్మెట్ ధరించి ఉన్నాడు. చెక్ పోస్టు వద్దనున్న పోలీసులు అతడిని ఆపారు. ఆ బైక్ వైపు వింత వింతగా చూడడం ప్రారంభించారు. ఎందుకు చూస్తున్నారో రైడర్‌కి అర్థం కాలేదు. ఈ ఘటన మధురైలో చోటు చేసుకుంది. అతని బండి వైపే ఆశ్చర్యంగా చూశారు. ఇప్పటి వరకు ఇలాంటి వాహనం చూల్లేదని అనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
మధురై ప్రాంతానికి వెళుతుండగా ఓ చెక్ పోస్టు విధులు నిర్వహిస్తున్న వారు రైడర్‌ని ఆపారు. ఎక్కడకు వెళుతున్నారు ? లైసెన్స్, ఆర్సీ తదితర వివరాలు చూపించాలని అడిగారు. అన్నీ ఉన్నాయని చెప్పాడు. బైక్ ఖరీదు ఎంత అని అడగగా ఆ వ్యక్తి రూ. 30 లక్షలని చెప్పాడు. అక్కడనే ఉన్న ఇతరులు, పోలీసులు ఆశ్చర్యపోయారు.
తాము ఫొటోలు దిగుతామని పోలీసులు అడిగారు. దీనికి అతను ఓకే చెప్పడంతో ఫొటోలు దిగి ముచ్చట తీర్చుకున్నారు. ఓ కాప్ అయితే..దానిపైకి ఎక్కి ఫొటో తీయించుకున్నాడు. కానీ..ఆ వ్యక్తి ధరించిన హెల్మెట్‌లో కెమెరా ఉందనే సంగతి పోలీసులకు తెలియలేకపోవచ్చు. ఈ వీడియోను అతను పోస్టు చేయడంతో వైరల్‌గా మారిపోయింది. డిసెంబర్ 19న పోస్టు చేస్తే..డిసెంబర్ 30వ తేదీ వరకు 2 లక్షల 78 వేల 104 మంది చూశారు.
RideWithKC పేరిట యూ ట్యూబ్‌లో ఓ వ్యక్తి పేజీని నిర్వహిస్తున్నాడు. ఇందులో వివిధ విశేషాలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తున్నాడు. మధురై వెళ్లిన సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు.
Read More : డెబిట్ కార్డులున్నవారికి హెచ్చరిక..EMV లేకపోతే బ్లాక్