తమిళనాడులో ఇవాళ ఒక్కరోజే 110 కరోనా కేసులు…అందరూ వాళ్లే

భారత్ లో కరోనా(COVID-19)కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువౌతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో సడెన్ గా గత రెండు రోజులుగా కొత్త కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ విధించే ముందు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మార్కజ్ బిల్డింగ్ లో జరిగిన మతపరమైన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. వీరంతా వారి సొంత ప్రాంతాలకు మార్చి 17 వ తేదీన వెళ్లిపోయారు. పలువురు విదేశీయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి నుంచే వీరికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.

అయితే ఇండియాలో మార్చి 24 న లాక్ డౌన్ చేశారు. లాక్ డౌన్ సత్ఫాలితాలు ఇస్తుందని అనుకుంటున్న సమయంలో కొత్త కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజలు అలర్ట్ అయ్యాయి. ఈ కొత్త కేసులన్నీ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన కేసులు కావడంతో దీనిపై కేంద్రం సీరియస్ గా దృష్టి సారించింది. తమిళనాడులో ఈ ఒక్కరోజులోనే 110 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో తూత్తుకుడి, తిరునెవేలి, శివగంగ, మధురై, కోయంబత్తూరు, తేని, దిండిగుల్ జిల్లాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ 110 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళే కావడంతో పళనిస్వామి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారి వివరాలను యుద్ధప్రాతిపదికన సేకరించి.. అందరినీ ఆస్పత్రులకు తరలిస్తోంది. కుటుంబ సభ్యులు, బంధువులను కూడా క్వారంటైన్ సెంటర్లకు చేరుస్తున్నారు.

తమిళనాడు నుంచి ఢిల్లీకి 1130 మంది వెళ్లగా, తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు 515 మందిని గుర్తించింది. మిగతా వారిని గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఈరోజు నమోదైన 110 కొత్త కేసులతో కలిపి తమిళనాడులో మొత్తం 234 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో నమోదైన 43 కొత్త కేసులు కూడా ఢిల్లీ నుంచి వచ్చినవే. దేశరాజధానిలో కూడా కరోనా కేసుల సంఖ్య ఒక్కరోజులో గణనీయంగా పెరిగింది. బుధవారం(ఏప్రిల్-1,2020) ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 152కి చేరింది. గడిచిన 24గంట్లలోనే 32మందకి కరోనా వచ్చినట్లు నిర్థారణ అయింది. అయితే ఇందులో 53మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారే.