కమల్‌కు మద్దతివ్వడం లేదు – రజనీకాంత్

సినీ నటుడు కమల్ హాసన్‌కు తాను మద్దతివ్వడం లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు.

  • Publish Date - April 10, 2019 / 03:26 AM IST

సినీ నటుడు కమల్ హాసన్‌కు తాను మద్దతివ్వడం లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు.

సినీ నటుడు కమల్ హాసన్‌కు తాను మద్దతివ్వడం లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. ఏదో ఊహించుకుని.. దీనిని చర్చనీయాంశం చేసి తమ స్నేహాన్ని మాత్రం దెబ్బతీయొద్దని ప్రజలను కోరారు ఈ స్టార్. తమిళనాడు లోక్ సభ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. కమల్..‘మక్కల్ నీధి మయ్యం’ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో నిలిచిన ఈ పార్టీకి ఈసీ ‘టార్చ్ లైట్’ గుర్తును కేటాయించింది. తనకు రజనీ మద్దతు తెలియచేస్తారనే నమ్మకం ఉందని ఇటీవలే కమల్ హాసన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనితో రజనీ రెస్పాండ్ కావాల్సి వచ్చింది. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
Read Also : లక్ష్మీస్ NTR సినిమాను చూడనున్న న్యాయమూర్తులు

రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే..పార్టీని మాత్రం ప్రకటించారు. పార్టీ స్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపిన రజనీ…2021 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెడుతున్నట్లు వెల్లడించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో తాను నదుల అనుసంధానం ప్రాజెక్టు గురించి చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. మేనిఫెస్టో అమలు చేస్తే నదులు అనుసంధానం అవుతాయన్నారు. తన ఆలోచనలకు వాజ్ పేయి సానుకూలంగా స్పందించారని, ఈ ప్రాజెక్టును తీసుకొస్తామని 2019 మేనిఫెస్టోలో బీజేపీ హామీనిచ్చిందని..ఇది నిజంగా జరిగితే ప్రజలు సంతోషిస్తారన్నారు. 

తమిళనాడులో ఏప్రిల్ 18న లోక్ సభకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 40 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కమల్ వెల్లడించారు. తాజాగా మద్దతివ్వనన్న రజనీ..వ్యాఖ్యలపై కమల్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. 
Read Also : ఎన్నికల్లో..మద్యం,మనీల వరద: రూ.528.98 కోట్లు సీజ్

ట్రెండింగ్ వార్తలు