Ramya Bharathi IPS : అర్థరాత్రి మహిళా ఐపీఎస్‌ సైకిల్ పై గస్తీ..షాక్ అయిన పోలీసులు..ప్రశంసించిన సీఎం

అర్థరాత్రి మహిళా ఐపీఎస్‌ సైకిల్ పై గస్తీ కాశారు. ఆమె ఐపీఎస్ అని తెలిసి పోలీసులు షాక్ అయ్యిరు. ఈ విషయం తెలిసిన సీఎం ఆమెను ప్రశంసించారు.

Woman IPS on Bicycle ride : ఐపీఎస్ అధికారులు అంటే ఎలా ఉంటారు?అర్థరాత్రి రోడ్ల మీద సైకిల్ పై తిరుగుతారా?పోలీసుల్లా గస్తీ కాస్తారా? అందులోని మహిళా అధికారులు అర్థరాత్రి గస్తీ తిరుగుతారా? అంటే లేదనే చెబుతాం. కానీ ఓ మహిళా ఐపీఎస్ మాత్రం అర్థరాత్రి సైకిల్ తొక్కుకుంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు. తమిళనాడు(Tamil Nadu) రాజధాని చెన్నై నగరంలో అర్థారాత్రి సమయంలో ఓ మహిళ సైకిల్ తొక్కుకుంటూ తిరగటం చూసిన పోలీసులు ఆమెను ఆపి ఏంటిలా తిరుగుతున్నావ్? అంటూ ప్రశ్నించారు.దానికి సదరు అధికారిణి చెప్పిన సమాధానం విని దిమ్మ తిరిగిపోయింది వారికి..‘సారీ మాడమ్’అంటూ తడబడిపోయారు. ఐపీఎస్ అయినా ఓ సాధారణ పోలీస్ లాగా సైకిల్ పై రాత్రి సమయాల్లో గస్తీ తిరగటం గురించి తెలిసిన సీఎం స్టాలిన్ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

Also read : Russia ukraine war : యుక్రెయిన్ పై యుద్ధంలో టార్గెట్స్ మిస్ అవుతున్న రష్యా..60 శాతం మిస్సైల్స్ విఫ‌లం

తమిళనాడులో మహిళా ఐపీఎస్ రమ్య భారతి (Ramya Bharathi IPS) సైకిల్ పై చక్కర్లు కొట్టటం సంచలనంగా మారింది. జాయింట్ కమిషనర్, చెన్నై నార్త్. రమ్యభారతి అర్ధరాత్రి ఒంటరిగా సైకిల్ తొక్కిన ఆమె ఉత్తర మండలం పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో తనిఖీలు చేశారు. ఐపీఎస్ అధికారిణి రమ్య భారతి తెల్లవారుజామున 2.45 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. వాలాజా రోడ్డు నుంచి ముత్తుసామి బ్రిడ్జి వరకు, ఎస్పాళ్లనేడ్ రోడ్డు, మింట్ స్ట్రీట్, మూలకొత్తలం ప్రాంతం మీదుగా వైతినాథన్ బ్రిడ్జి మీదుగా తాండయార్‌పేట పోలీస్ స్టేషన్ వరకు సైకిల్‌పై తిరిగారు.

రాత్రిపూట సైకిల్‌పై పర్యటిస్తూ మహిళా ఐపీఎస్‌ అధికారి గస్తీ నిర్వహించిన దృశ్యాలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి. ఈ విషయం తమిళనాడు సీఎం స్టాలిన్‌ దృష్టికి వెళ్లటంతో ఆయన ఆమెను అభినందనలతో ముంచెత్తారు. 2008 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రమ్య భారతి.. గ్రేటర్‌ చెన్నై ఉత్తర మండల జాయింట్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గురువారం (మార్చి 24,2022) రాత్రి చెన్నైలోని ఫ్లవర్‌ బజారు నుంచి చాకలిపేట వరకు సైకిల్‌పై గస్తీ నిర్వహించారు. పోలీసులు డ్యూటీలు సక్రమంగా చేస్తున్నారా? లేదా? అని పరిశీలించారు. రోడ్లపై తిరుగుతున్న అనుమానితులను విచారించారు. ఈ విషయం దుబాయ్‌ పర్యటనలో ఉన్న సీఎం ఎంకే స్టాలిన్‌ దృష్టికి వెళ్లింది. దీంతో ట్విట్టర్‌ ద్వారా ఐపీఎస్ రమ్యభారతికి అభినందనలు తెలిపారు.

Also read : Kim Jong Un: అమెరికా, జపాన్‌లను రెచ్చగొడుతున్న నార్త్ కొరియా నియంత కిమ్.. Hwasong-17 క్షిపణి ప్రయోగం..

ఫోర్ట్ పోలీస్ స్టేషన్, ఎస్పాళ్లనేడ్ పోలీస్ స్టేషన్, ఫ్లోరిస్ట్ పోలీస్ స్టేషన్, యానైక్కవుని పోలీస్ స్టేషన్, వాషర్‌మెన్‌పేట్ పోలీస్ స్టేషన్, ఆర్కే నగర్ పోలీస్ స్టేషన్, న్యూ వాషర్‌మెన్‌పేట్ పోలీస్ స్టేషన్, తండయార్‌పేట్ పోలీస్ స్టేషన్‌లతో సహా 8 పోలీస్ స్టేషన్లపై దాడులు నిర్వహించారు. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో సైకిల్‌పై వెళ్లేటప్పుడు రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు, రాత్రి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులను విధులపై ఆరా తీశారు. రాత్రి వేళల్లో డ్యూటీ చేస్తున్న పోలీసులకు అవగాహన కల్పించేందుకు ఈ సైకిల్ గస్తీ చేశాను అని ఐపీఎస్ రమ్య భారతి తెలిపారు. చెన్నై నార్త్ జాయింట్ కమిషనర్ రమ్య భారతి చర్యపై పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఐపీఎస్ రమ్య భారతిని అభినందిస్తూ..మహిళలపై హింసను నియంత్రించి మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు