Tata Steel: కొవిడ్‌తో ఉద్యోగులు చనిపోయినా జీతాలిస్తాం – టాటా స్టీల్

కొవిడ్-19తో ఎఫెక్ట్ అయిన కుటుంబ సభ్యులకు టాటా స్టీల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ప్రకటించింది. ఆదివారం కంపెనీ అనౌన్స్ చేసిన స్కీమ్ ప్రకారం.. ఉద్యోగులెవరైనా కొవిడ్ తో చనిపోతే ఆ కుటుంబానికి అతని కుటుంబానికి చివరి...

Tata Steel: కొవిడ్‌తో ఉద్యోగులు చనిపోయినా జీతాలిస్తాం – టాటా స్టీల్

Tata Steel

Updated On : May 25, 2021 / 3:06 PM IST

Tata Steel: కొవిడ్-19తో ఎఫెక్ట్ అయిన కుటుంబ సభ్యులకు టాటా స్టీల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ప్రకటించింది. ఆదివారం కంపెనీ అనౌన్స్ చేసిన స్కీమ్ ప్రకారం.. ఉద్యోగులెవరైనా కొవిడ్ తో చనిపోతే ఆ కుటుంబానికి అతని కుటుంబానికి చివరి నెల అందుకున్నంత శాలరీని పుట్టిన తేదీ ప్రకారం 60 ఏళ్లు వచ్చే వరకూ అందజేయనుంది.

‘సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లో టాటా స్టీల్ బెస్ట.. ఆ కుటుంబాలు మనుగడ సాధించడానికి గౌరవ ప్రదమైన వెసలుబాటు కల్పిస్తుంది. ఎవరైనా కొవిడ్ తో చనిపోతే ఆ కుటుంబంలో నామినీకి ఉద్యోగి వయస్సు (సర్టిఫికేట్స్ ప్రకారం) 60 వచ్చేంత వరకూ చివరి జీతం ప్రతి నెల అకౌంట్లో వేస్తాం’ అని కంపెనీ స్టేట్మెంట్ లో చెప్పింది.

అంతేకాకుండా బతికి ఉండగా అందించిన మెడికల్ బెనిఫిట్స్, హౌజింగ్ ఫెసిలిటీలను కూడా అందిస్తారు. దీంతో పాటుగా ఫ్రంట్ లైన్ ఉద్యోగి కొవిడ్ ఇన్ఫెక్షన్ కు గురై ఉద్యోగం కోల్పోయి చనిపోతే వారి పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను గ్రాడ్యుయేషన్ వరకూ మొత్తం సంస్థనే భరిస్తుంది.

‘టాటా స్టీల్ #AgilityWithCare అనే పేరుతో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ను ఉద్యోగి కుటుంబ సభ్యులకు అందజేసేందుకు విస్తరిస్తూ వస్తుంది. మాకు తోచినంత మేం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కెపాసిటీకి తగ్గట్లు ఈ క్లిష్ట సమయంలో ఇతరులకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం’ టాటా స్టీల్ ట్విట్టర్లో పేర్కొంది.

ఈ అనౌన్స్‌మెంట్‌కు కంపెనీకి ట్విట్టర్లో పొగడ్తలు, ప్రశంసల వర్షం కురుస్తోంది.