114 Years Teak Tree : బ్రిటీష్ కాలంనాటి 114 ఏళ్ల టేకు చెట్టు .. సర్కారువారి పాటలోధర ఎంత పలికిందో తెలుసా?!

బ్రిటిష్‌వారు నాటిన 114 ఏళ్ల నాటి టేకు చెట్టు వేలంపాటలో అత్యంత భారీ ధర పలికింది. దీన్ని వేలం వేసిన డబ్బులు సర్కారు ఖజానాను నింపేసాయి. 114 ఏళ్లనాటీ ఈ టేకు చెట్టు వేలం వేయగా రూ.40 లక్షల ధర పలికింది.1909లో అంటే మనకు స్వాతంత్ర్యం రాకముందు నాటిన మొక్క మానైంది. భారీగా బలంగా ఎదిగింది.

114 Years Teak Tree : బ్రిటీష్ కాలంనాటి 114 ఏళ్ల టేకు చెట్టు .. సర్కారువారి పాటలోధర ఎంత పలికిందో తెలుసా?!

114 Years Teak Tree

Updated On : February 23, 2023 / 12:53 PM IST

114 Years Teak Tree : టేకు కలప. ఖరీదైన కలప. టేకు చెట్టు వయస్సు ఎంత ఎక్కువగా ఉంటే అది అంత దృఢంగా ఉంటుంది. టేకు కలపతో చేసిన ఇంటి ద్వారబంధాలు, తలుపులుగానే కాకుండా ఫర్నీచర్ కు ఉపయోగిస్తుంటారు. టేకుతో చేసిన ఫర్నీచర్ కు మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే టేకు కలప దృఢంగా ఉండి, చెదలను తట్టుకుంటుంది. పుచ్చుపట్టదు. పైగా ఎక్కువకాలం మన్నుతుంది. ముదురు గోధుమ రంగు చారలు కలిగి దీనితో చేసిన వస్తువులు చాలా అందంగా ఉంటాయి. అందుకే టేకు కలపకు అంత డిమాండ్ ఉంటుంది.

ఇదిలా ఉంటే 114 ఏళ్లనాటి టేకు చెట్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే..బ్రిటిష్‌వారు నాటిన 114 ఏళ్ల నాటి టేకు చెట్టు వేలంపాటలో అత్యంత భారీ ధర పలికింది. దీన్ని వేలం వేసిన డబ్బులు సర్కారు ఖజానాను నింపేసాయి. 114 ఏళ్లనాటీ ఈ టేకు చెట్టు వేలం వేయగా రూ.40 లక్షల ధర పలికింది.1909లో అంటే మనకు స్వాతంత్ర్యం రాకముందు నాటిన మొక్క మానైంది. భారీగా బలంగా ఎదిగింది. అలా ఆ టేకుచెట్టు ఎండిపోయింది. ఎండిపోయిన అది టేకు చెట్టాయే..మరి డిమాండ్ మామూలుగా ఉండదుగా..ఏనుగు బతికున్నా చచ్చిపోయినా వెయ్యి వరాలు అన్నట్లుగా ఎండిపోయినా..114 ఏళ్లనాటి ఈ టేకు చెట్టు అక్షరాలు రూ.40లక్షల ధర పలికింది. దెబ్బకు అటవీశాఖవారి ఖజానాను నింపేసింది.

కేరళలోని నిలంబూరు టేకు ప్లాంటేషన్‌లో బ్రిటిష్‌వారు నాటిన 114 ఏళ్ల నాటి టేకు చెట్టు వేలంపాటలో రూ.40 లక్షల భారీ ధర పలికింది.1909లో నాటిన చెట్టు ఎండిపోయి, పరిరక్షణ ప్లాట్‌లో దానంతటదే పడిపోవడంతో అటవీ శాఖ సిబ్బంది దీన్ని అత్యంత జాగ్రత్తగా సేకరించారు. పరిరక్షణ ప్లాట్లలోని టేకు చెట్లు వాటంతట అవే పడిపోయిన తర్వాతే వాటిని సేకరిస్తారని కేరళ అటవీశాఖ అధికారి తెలిపారు.

ఎండిపోయిన ఓ టేకు చెట్టును అటవీశాఖ వేలయం వేయగా ఓ వ్యక్తి దాదాపు రూ.40 లక్షలు చెల్లించి ఆ చెట్టును దక్కించుకున్నారు. 114 ఏళ్ల కిందట బ్రిటిష్ కాలంలో నాటిన ఈ చెట్టు నీలాంబరి టేకు రకానికి చెందింది. ప్రభుత్వ సంరక్షణలో ఉన్న ఈ వృక్షం పూర్తిగా ఎండిపోయి.. ఇటీవల కూలిపోయింది. కేరళలోని నెదుంకాయం అటవీ డిపోలో ఫిబ్రవరి 10న దీన్ని వేలానికి ఉంచగా.. బృందావన్‌ టింబర్స్‌ యజమాని అజీశ్‌ కుమార్‌ రూ.39.25 లక్షలకు సొంతం చేసుకున్నారు. 8 క్యూబిక్‌ మీటర్ల మందంతో ఉన్న ఈ టేకును.. మూడు భాగాలుగా చేసి విక్రయించారు అటవీశాఖ అధికారులు.

ఈవేలం గురించి నెదుంకాయం అటవీ డిపో అధికారి షెరీఫ్ వివరిస్తూ..కొట్టేసిన చెట్ల కంటే వాటికవే ఎండిపోయిన టేకు చెట్లకు మంచి డిమాండ్ ఉంటుందని ఎందుకంటే ఎండిపోయిన చెట్టు కలప చాలా దృఢంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కావాలని కొట్టేసిన వృక్షాలను వేలం వేయరని..ఎండిపోయి, దానంతట అదే కూలిపోయిన వృక్షాలను మాత్రమే వేలం వేస్తారని తెలిపారు. టేకు చెట్లలో చాలా రకాలున్నాయని ముఖ్యంగా నీలాంబరి టేకుకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉందని తెలిపారు. తాజాగా వేలం వేసిన వృక్షాన్ని మూడు భాగాలు చేయగా.. పెద్దది మూడు మీటర్ల కంటె ఎక్కువ పొడవు ఉన్న ఈ భాగానికి రూ.23 లక్షలు,మిగిలి రెండు భాగాలకు రూ.11 లక్షలు, రూ.5.25 లక్షలు వేలంగా చెల్లించారని తెలిపారు. 1909లో బ్రిటీష్ వారు కేరళ అటవీప్రాంతంలో నాటిని ఈ చెట్టుని ఇంతకాలం పరిరక్షించిన అధికారులందరికి పేరు పేరునా అభినందనలు తెలుపుతున్నామని షెరీఫ్ అన్నారు.