KCR - Tejashwi Yadav
Lok Sabha Elections 2024 – Tejashwi Yadav: దేశంలోని దాదాపు 15 పార్టీలు జూన్ 23న సమావేశంలో పాల్గొంటాయని బిహార్ (Bihar) ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) పాల్గొంటారా? అన్న విషయంపై తేజస్వీ స్పందిస్తూ.. తాము ఇప్పటివరకు ఆయనతో మాట్లాడలేదని తెలిపారు.
బీజేపీ (BJP) పై తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని విపక్షాలను బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఏకం చేయడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ తో కలిసి తేజస్వీ యాదవ్ ప్రయత్నాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 23న విపక్షాలు పట్నాలో సమావేశమై లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంపై చర్చిస్తాయి.
ఈ నేపథ్యంలో దీనిపై తేజస్వీ యాదవ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. విపక్షాల ఐక్యతను తలచుకుని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ భయపడుతోందని చెప్పారు. విపక్షాల ఐక్యతపై బీజేపీ చేస్తోన్న వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
” విపక్షాల సమావేశం ప్రభావం ఎలా ఉంటుందన్న విషయాన్ని నిర్ణయించాల్సింది బీజేపీ కాదు. లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలకు ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై బీజేపీ నేతలు భయపడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో వారు ఓడిపోయారు. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీలోనూ ఓడిపోయారు” అని తేజస్వీ యాదవ్ చెప్పారు.
Smriti Irani: ప్రేమ అని మాట్లాడుతున్నారు.. అది ఇందులో భాగమేనా రాహుల్?: స్మృతీ ఇరానీ