CM KCR : అమిత్ షాతో కేసీఆర్ భేటీ.. రెండు రోజుల్లో ఇది రెండోసారి

తెలంగాణ సీఎం కేసీఆర్ హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Cm Kcr

CM KCR : మరో సారి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రెండు రోజుల్లో ఇది రెండో భేటీ. సీఎం కేసీఆర్ వెంట డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చర్యలపై డీజీపీ అమిత్ షాకు ప్రెజెంటేషన్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

Read More : Maa Election: ప్రకాష్ రాజ్ ప్యానల్ నామినేషన్ల దాఖలు.. ఇక సమరమే?

మావోయిస్టుల కట్టడికి , అభివృద్ధికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, గ్రేహౌండ్స్ ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అలాగే అభివృద్ధి పనులు ఏ విధంగా చేపడుతున్నారు అనే అంశాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా, ఐబీ చీఫ్ అరవింద్ కుమార్ కి డీజీపీ మహేందర్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎటువంటి చర్యలతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వారి కార్యకలాపాలను అరికట్టవచ్చు.. వారికి నిధులు రాకుండా ఏ విధంగా అడ్డుకట్ట వేయవచ్చు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై ప్రెజెంటేషన్ సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

Read More : Drugs Mafia : హైదరాబాద్‌తో డ్రగ్స్ మాఫియాకు లింక్ ? షాకింగ్ న్యూస్

ఇదిలా ఉంటే ఆదివారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో మావోయిస్టుల నిర్ములన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.