Maa Election: ప్రకాష్ రాజ్ ప్యానల్ నామినేషన్ల దాఖలు.. ఇక సమరమే?

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA) ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ల ప్రక్రియ నేటి నుండి మొదలైంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, సీవీఎల్ నరసింహారావు పోటీకి సిద్దమైనట్లుగ

Maa Election: ప్రకాష్ రాజ్ ప్యానల్ నామినేషన్ల దాఖలు.. ఇక సమరమే?

Maa Election

Maa Election: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA) ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ల ప్రక్రియ నేటి నుండి మొదలైంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, సీవీఎల్ నరసింహారావు పోటీకి సిద్దమైనట్లుగా ప్రకటించారు. ఇందులో ప్రకాష్ రాజ్ ప్యానల్ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్షుడిగా ప్రకాశ్‌ రాజ్‌ నామినేషన్‌ దాఖలు చేయాగా.. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ నామినేషన్ వేశారు. వీరితో పాటు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు కూడా నామినేషన్‌ దాఖలు చేశారు.

MAA Election: ఒకే కుటుంబం నుండి వ్యక్తిగత విమర్శలు స్థాయికి!

‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే 27మంది సభ్యులతో కూడిన తన ప్యానల్‌ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే. జయసుధ, శ్రీకాంత్, సాయి కుమార్, బెనర్జీ, ఉత్తేజ్, అనసూయ, సుడిగాలి సుధీర్ ఈ ప్యానెల్ లో ఉన్న సభ్యులలో కొందరు కాగా వీరంతా ఈరోజే నామినేషన్స్ దాఖలు చేశారు. నామినేషన్స్ అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్.. మా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగుతున్నట్లు వెల్లడించారు.

MAA Elections: మంచు విష్ణు ప్యానెల్ ఇదే.. హీట్ పెంచేస్తున్న మా ఎలక్షన్!

కాగా ఈరోజు మధ్యాహ్నమే సీవీఎల్‌ నరసింహారావు నామినేషన్‌ దాఖలు చేయనుండగా మరో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు రేపు (మంగళరవారం) నామినేషన్స్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈనెల 29వరకు నామినేషన్లను స్వీకరించనుండగా 30న నామినేషన్‌ల పరిశీలన ఉండనుంది. అక్టోబర్‌1-2 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించుకోనే అవకాశం ఉండగా అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే సాధారణ ఎన్నికలను తలపించేలా ఉన్న మా ఎన్నికలు నామినేషన్ల పర్వం మొదలవడంతో ఇక సమరమే అన్నట్లుగా వాతావరణం కనిపించనుంది.