Drugs Mafia : హైదరాబాద్‌తో డ్రగ్స్ మాఫియాకు లింక్ ? షాకింగ్ న్యూస్

టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసు ఇప్పటికే హైదరాబాద్‌ను కుదిపేస్తుండగా...మరో షాకింగ్ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌తో  డ్రగ్స్ మాఫియాకు లింకున్నట్లు తేలడం సంచలనం రేపుతోంది.

Drugs Mafia : హైదరాబాద్‌తో డ్రగ్స్ మాఫియాకు లింక్ ? షాకింగ్ న్యూస్

Drugs

Drug Mafia Hyderabad: టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసు ఇప్పటికే హైదరాబాద్‌ను కుదిపేస్తుండగా… తాజాగా మరో షాకింగ్ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌తో  డ్రగ్స్ మాఫియాకు లింకున్నట్లు తేలడం సంచలనం రేపుతోంది. హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్‌ వ్యాపారి గోవాలో పట్టుబడ్డాడు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు గోవాలో వారం రోజులు జల్లెడ పట్టి డ్రగ్స్‌ వ్యాపారి సిద్ధిఖ్‌ను అరెస్ట్‌ చేశారు. ఇది హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసింది. సిద్ధిఖ్‌.. ముంబై, హైదరాబాద్‌, బెంగళూరులో డ్రగ్స్‌ రవాణా చేస్తున్నట్లు NCB అధికారులు గుర్తించారు.

Read More : Producer Venkat: ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత కన్నుమూత

చత్తీస్‌ఘడ్‌కు చెందిన నౌమాన్‌ సవేరీతో కలిసి గోవాలో డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నాడని సమాచారం. ఇటీవల సవేరీని అరెస్ట్ చేయడంతో  సిద్ధిఖ్‌ బాగోతం బయటపడింది. అతడిచ్చిన సమాచారంతో సిద్ధిఖ్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని విచారిస్తే నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.ముంబైకి చెందిన డ్రగ్స్‌ మాఫియా… హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని పారిశ్రామిక కంపెనీలో డ్రగ్స్ తయారు చేయిస్తోందని, అక్కడి నుంచే గోవా, బెంగళూరు, ముంబై ప్రాంతాలకు రవాణా అవుతోందని ఎన్సీబీ గుర్తించింది.

Read More : Kanakambaram : కనక వర్షం కురిపిస్తున్న కనకాంబరం సాగు

దీంతో.. సిద్దిఖ్‌ దగ్గరున్న వివరాల ఆధారంగా ముంబై డ్రగ్స్‌ మాఫియాను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.నాలుగేళ్ల క్రితం గోవాలోని సియోలిమ్‌ బీచ్‌ ప్రాంతంలో సెటిల్‌ అయిన సిద్ధిఖ్‌… అక్కడే డ్రగ్‌ పెడ్లర్‌గా మారి ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌కు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నాడు. అయితే… సిద్దిక్‌ హైదరాబాద్‌ నుంచి గోవాకు ఎందుకు మకాం మార్చాడన్న దానిపై ఎన్సీబీ దృష్టి పెట్టింది. గోవా కేంద్రంగా భారీ స్థాయిలోనే నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకొని ఉంటాడా? అనే కోణంలో విచారణ సాగిస్తోంది. అతడితో కాంటాక్ట్ లో ఉన్న వారిని గుర్తించే పనిలో పడింది.