telangana congress incharge manikkam tagore resigns
telangana congress incharge manikkam tagore resigns : తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రాజీనామా చేశారు.ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఖర్గే రావడంతో పాత వారంతా రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో మాణిక్కం ఠాగూర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కాగా..మల్లిఖార్జున ఖర్గే త్వరలోనే కొత్త టీమ్ ను ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే మొదలు పెట్టారు.
కాగా..కాంగ్రెస్ కు పూర్వ వైభవం రావాలంటే కొత్త నేత అవసరం ఉన్న క్రమంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ నిర్వహించటం..ఈ పోటీలో పార్టీ సీనియర్ నేత ఖర్గే ఎన్నిక కావటం జరిగింది. 24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర వ్యక్తి అధ్యక్షులు అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఖర్గే 53 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన సిటీ కాంగ్రెస్ అధ్యక్షడి నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడి పదవికి చేరుకున్నారు. లోక్ సభ, రాజ్యసభ పక్ష నేతగా, 10 ఏళ్ళు కేంద్ర మంత్రిగా, 9 సార్లు ఎమ్మెల్యేగా, కర్ణాటక రాష్ట్ర మంత్రిగా పని చేశారు. కాగా, మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్‌పై 84 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఈక్రమంలో పార్టీకి కొత్త నేతలను ఎన్నుకునే క్రమంలో పాత నేతలంతా రాజీనామాలుచేశారు. ఆయా రాష్ట్రాల్లో కొత్త ఇంచార్జ్ లు నియామకం కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఖర్జే కొత్త నేతలను నియమించనున్నారు.
New Congress President: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం.. బీజేపీపై విమర్శలు
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ విధానాలు సరిగ్గాలేవని విమర్శించారు.తనను సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి చేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఖర్గే చెప్పారు. తమ పార్టీని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని వెల్లడించారు.