New Congress President: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం.. బీజేపీపై విమర్శలు

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ విధానాలు సరిగ్గాలేవని చెప్పారు. తనను సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి చేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఖర్గే చెప్పారు. తమ పార్టీని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు.

New Congress President: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం.. బీజేపీపై విమర్శలు

New Congress President: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ విధానాలు సరిగ్గాలేవని చెప్పారు.

తనను సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి చేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఖర్గే చెప్పారు. తమ పార్టీని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతల నిర్వహణలో తాను అందరి సాయం తీసుకుంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడడానికి పనిచేస్తాని తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తోందని చెప్పారు.

మ పార్టీ నేత సోనియా గాంధీ పదవులను తృణప్రాయంగా వదులుకున్నారని ఆయన అన్నారు. తమ పార్టీని దేశంలో రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత సోనియా గాంధీ దక్కుతుందని ఆయన చెప్పారు. కాగా, మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్‌ ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ఎన్నిక సర్టిఫికెట్ ను ఇచ్చారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, మాజీ సీఎంలు, మాజీ పీసీసీ అధ్యక్షులు, ఇతర ఏఐసీసీ పదాధికారులు హాజరయ్యారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..