National Herald case : ఈడీ విచారణకు హాజరైన టీ.కాంగ్రెస్ నేతలు

నేషనల్ హెరాల్డ్ కేసులో టీ.కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణకు హాజరయ్యారు.

National Herald case : ఈడీ విచారణకు హాజరైన టీ.కాంగ్రెస్ నేతలు

Telangana Congress leaders who attended the ED inquiry

Updated On : October 6, 2022 / 11:54 AM IST

National Herald case : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. దీంట్లో భాగంగా ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విచారణకు హాజరుఅయ్యారు. మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్ ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈక్రమంలో ఈరోజు ఈడీ విచారణకు గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్ కూడా హాజరయ్యారు. పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50ఏ ప్రకారం ఈ ఇద్దరిని ఈడీ అధికారులు విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. యంగ్ ఇండియా లిమిటెడ్ కు వచ్చిన విరాళాల విషయంపై అధికారులు విచారిస్తున్నారు. ఇద్దరు నేతల స్టేట్ మెంట్ లను అధికారులు రికార్డ్ చేస్తున్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీకి ఈడీ సమన్లు పంపింది. పలుమార్లు విచారణకు అగ్రనేతలు స్వయంగా హాజరయ్యారు. దీనిపై బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తుండగా… హస్తం నేతలు మాత్రం కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చటానికి బీజేపీ ఇటువంటి కుట్రలు చేస్తోంది అంటూ విమర్శిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు వ్యవహారంకాంగ్రెస్ అధినేతల నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతల వరకు చేరింది. పలువురు నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయగా వారు కూడా విచారణకు హాజరయ్యారు.