Chief Justice of India : జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన శ్రీనివాసరాజు

Chief Justice of India : జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన శ్రీనివాసరాజు

Nv Ramana

Updated On : April 24, 2021 / 5:01 PM IST

 Justice NV Ramana : భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఎన్వీరమణను పలువురు అభినందిస్తున్నారు. టీటీడీ మాజీ JEO, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు.. చీఫ్‌ జస్టిస్ ఎన్వీ రమణను ఆయన ఛాంబర్‌లో కలిసి అభినందించారు. తెలుగు వ్యక్తి…CJIగా నియమితులవ్వడం గర్వకారణంగా ఉందన్నారు శ్రీనివాస రాజు. ఈ ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ.రమణ.

1957 ఆగస్టు 27న ఏపీలోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 సంవత్సరం జూన్‌లో ఏపీ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సీజేఐగా ఎన్‌.వీ రమణ బాధ్యతలు స్వీకరించనున్నందున స్వగ్రామంలో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చీఫ్ జస్టిస్‌గా పదవీ విరమణ చేసిన బోబ్డేతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ఎన్వీ రమణ. బోబ్డే తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో బోబ్డేకు అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు.

 

Read More : కరోనా వ్యాక్సిన్ల దిగుమతిపై కస్టమ్ సుంకం 3 నెలలు రద్దు