శబరిమల వివాదం ఓవైపు టెన్షన్ రేపుతున్నప్పటికీ.. ఆలయం వద్ద మాత్రం పరిస్థితి ప్రశాంతంగా కనిపిస్తోంది. గత తీర్పు ప్రకారం ఆలయ ప్రవేశం చేస్తామని కొందరు మహిళలు ప్రకటించినప్పటికీ.. ఆ గలాటా మొదటి రోజుకే పరిమితం అయింది. కాకపోతే, 20వ తేదీన శబరిమల వస్తానంటూ తృప్తి దేశాయ్ ప్రకటించడంతో.. పరిస్థితి ఎలా ఉంటుందోనన్న టెన్షన్ మాత్రం అలానే ఉంది. ఇప్పుడైతే మాత్రం స్వామియే శరణం అయ్యప్ప అనే నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతున్నాయి.
ఆలయం తెరుచుకున్న మొదటి రోజున పది మంది మహిళలు.. ఆలయ ప్రవేశం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మొత్తం 30 మంది మహిళలు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితైతే కనిపిస్తోంది. మరోవైపు ఈనెల 20న సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ శబరిమల వస్తున్నాననంటూ ప్రకటించింది. ఇక ఆరోజు ఎలాంటి టెన్షన్ వాతావరణం ఉంటుందో చూడాలి.
మండల పూజ కోసం 2019, నవంబర్ 16వ తేదీ శనివారం సాయంత్రం శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. డిసెంబర్ 27 వరకు ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి. అప్పటి వరకు ఆలయ ద్వారాలు తెరిచే ఉంచుతారు. తరువాత అయ్యప్ప ఆలయాన్ని మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. తిరిగి డిసెంబరు 30న మకరవిళక్కు ఉత్సవాల్లో భాగంగా ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. అప్పటి నుంచి జనవరి 20 వరకు పూజలు కొనసాగుతాయి.
Read More : కర్నాటకలో కలకలం : కాంగ్రెస్ ఎమ్మెల్యే్పై కత్తితో దాడి