Jammu and Kashmir : జమ్మూకశ్మీరులో చొరబాటు యత్నం విఫలం..ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీరులో శనివారం పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం అయింది. అఖ్నూర్ ప్రాంతంలో చొరబాటు యత్నం విఫలం కావడంతో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. పాకిస్థాన్ దేశం నుంచి నలుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో భారతదేశంలోకి చొరబడేందుకు చేసిన యత్నాన్ని భారత జవాన్లు వమ్ము చేశారు....

Jammu and Kashmir army

Jammu and Kashmir : జమ్మూకశ్మీరులో శనివారం పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం అయింది. అఖ్నూర్ ప్రాంతంలో చొరబాటు యత్నం విఫలం కావడంతో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. పాకిస్థాన్ దేశం నుంచి నలుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో భారతదేశంలోకి చొరబడేందుకు చేసిన యత్నాన్ని భారత జవాన్లు వమ్ము చేశారు.

ALSO READ : Covid-19 Cases : మళ్లీ విజృంభించిన కరోనా మహమ్మారి.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. శనివారం తెల్లవారుజామున జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి)లో కాపలా కాస్తున్న భద్రతా బలగాలు చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. శనివారం నలుగురు ఉగ్రవాదులు అఖ్నూర్ ఖౌర్ సెక్టారులోకి చొరబడేందుకు చేసిన యత్నాన్ని భద్రతా బలగాలు విఫలం చేశాయి.

ALSO READ : Ayodhya Shri Ram Airport : పలు నగరాల నుంచి అయోధ్య శ్రీరామ్ విమానాశ్రయానికి విమాన సర్వీసులు

పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఆర్మీజవాన్లు మరణించారు. గురువారం తెల్లవారుజామున భారత జవాన్లు గాలిస్తుండగా ధాత్వార్ మోర్ వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తామే ఈ దాడులకు పాల్పడ్డామని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించింది.