Covid-19 Cases : మళ్లీ విజృంభించిన కరోనా మహమ్మారి.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

భారత్ లోనూ కరోనా కలవరం రేపుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏడు నెలల గరిష్టానికి కోవిడ్ కొత్త కేసులు చేరాయి.

Covid-19 Cases : మళ్లీ విజృంభించిన కరోనా మహమ్మారి.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

COVID-19

Covid-19 Cases : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నెల రోజుల్లో 52 శాతం పాజిటివ్ కేసులు పెరిగాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్ లోనూ కరోనా కలవరం రేపుతోంది. మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏడు నెలల గరిష్టానికి కోవిడ్ కొత్త కేసులు చేరాయి.

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 748 కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. కేరళలో ఇద్దరు, కర్ణాటక లో ఒకరు రాజస్థాన్ లో ఒకరు కరోనా బారిన పడి మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 3420 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కేరళలో 266 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 2,872 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Corona : ఏపీలో కరోనా కలకలం.. విశాఖలో మూడు కేసులు నమోదు

కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. తెలంగాణలో కొత్తగా 8 కోవిడ్ కేసులు, ఏపీలో 8 కోవిడ్ కేసులు నమోదు, తమిళనాడులో 15, కర్ణాటకలో 70 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

ప్రస్తుతం తెలంగాణలో 27 యక్టీవ్ కేసులు, ఏపీలో 12 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. జేఎన్.1 కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇప్పటి వరకు దేశంలో 22 జేఎన్.1 కేసులను గుర్తించారు. కేరళ, గోవాలోనే అత్యధికంగా జేఎన్.1 కేసులు నమోదు అయ్యాయి.