Encounter : బారాముల్లాలో ఎన్‌కౌంటర్…ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. బారాముల్లా జిల్లాలో శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు....

Encounter : జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. బారాముల్లా జిల్లాలో శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. బారాముల్లా జిల్లాలోని ఉరి, హత్లాంగా ఫార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదులకు,ఆర్మీ బారాముల్లా పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని కాశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్ లో పోస్ట్ చేశారు.

US Airport : యూఎస్ విమానాశ్రయంలో సెక్యూరిటీ బాగోతం…ప్రయాణికుల బ్యాగులో నుంచి సెక్యూరిటీ వర్కర్ల డబ్బు చోరీ

ఈ ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం అయ్యాడు. బారాముల్లాలో ఉగ్రవాదుల కోసం కేంద్ర భద్రతా బలగాల గాలింపు కొనసాగుతోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ శనివారం 4వ రోజుకు చేరుకుంది.

Odisha : ఒడిశాలో దారుణం..భార్యను చంపి, ముక్కలు చేసి…

శనివారం పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం డ్రోన్‌తోనూ నిఘా వేశారు. ఉగ్రవాదులను మట్టుబెడతామని లోయ పోలీసు చీఫ్ చెప్పారు. అనంత్ నాగ్ ప్రాంతంలో మరింత మంది ఉగ్రవాదుల కోసం బలగాలు వెతుకుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు