Amarnath Yatra : అమర్‌నాథ్‌ యాత్రను మరోసారి టార్గెట్ చేసిన టెర్రరిస్టులు

తాము మత విశ్వాసాలకు వ్యతిరేకం కాదని...కానీ మతం పేరుతో కొన్ని సంస్థలు కశ్మీరు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయని లేఖ విడుదల చేసింది. కశ్మీరు ప్రజలకు ఏమైనా జరిగితే...ఆ ప్రాంతాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది.

Amarnath yatra : అమర్‌నాథ్ యాత్రను టెర్రరిస్టులు మరోసారి టార్గెట్ చేశారు. యాత్ర పేరు చెప్పి ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని…లష్కరే తోయిబా గ్రూప్‌నకు చెందిన…ది రెసిస్టెంట్ ఫ్రంట్‌ మండిపడింది. 80 రోజులు జరిగే యాత్ర కోసం 8 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని..వారంతా కశ్మీరులో ప్రశాంతతకు భంగం కలిగించేందుకు వస్తున్నారని లేఖ విడుదల చేసింది. అమర్‌నాథ్ యాత్ర పేరుతో వ్యాలీలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్టు చర్యలకు పాల్పడుతోందని టెర్రరిస్టు గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాము మత విశ్వాసాలకు వ్యతిరేకం కాదని…కానీ మతం పేరుతో కొన్ని సంస్థలు కశ్మీరు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయని లేఖ విడుదల చేసింది. కశ్మీరు ప్రజలకు ఏమైనా జరిగితే…ఆ ప్రాంతాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. అమర్ నాథ్ యాత్రను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించినట్టైతే…ప్రభుత్వాన్ని అడ్డుకుంటామని..ప్రతిఘటన తప్పదని వార్నింగ్ ఇచ్చింది.

Amarnath Yatra : అమర్ నాథ్ యాత్రికులకు కేంద్రం శుభవార్త.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ..

అమర్ నాథ్ యాత్రికులు కశ్మీరు సమస్యలలో జోక్యం చేసుకోకపోతే మంచిదని చెప్పింది. ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుంటామని…వారి రక్తం కల్లజూస్తామని ఉగ్రవాదులు హెచ్చిరంచారు. పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 30 నుంచి ఆగస్టు 11 వరకు జరగనుంది. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రకు 8లక్షల మంది వస్తారని జమ్ముకశ్మీర్ అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు