Amarnath Yatra : అమర్ నాథ్ యాత్రికులకు కేంద్రం శుభవార్త.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ..

అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కొవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి తరువాత రెండేళ్ల విరామం అనంతరం యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ...

Amarnath Yatra : అమర్ నాథ్ యాత్రికులకు కేంద్రం శుభవార్త.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ..

Amarnath Yara

Updated On : April 12, 2022 / 12:16 PM IST

Amarnath Yatra : అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కొవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి తరువాత రెండేళ్ల విరామం అనంతరం యాత్ర తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమై ఆగస్టు 11న ముగుస్తుంది. అమర్ నాథ్ యాత్రకు వెళ్లేవారి కోసం సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. గతంలో రూ. 100 ఉన్న ఫీజు ఇప్పుడు రూ. 120గా నిర్ణయించినట్లు జమ్మూలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ యుతేందర్ కుమార్ తెలిపారు. ఈ యాత్రకు పాల్గొనే వారు 13-75 సంవత్సరాల మధ్య వయస్సు గల భక్తులై ఉండాలి.

Amarnath Yatra: జూన్ ౩౦ నుంచి అమర్ నాథ్ యాత్ర

ఇదిలా ఉంటే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు సమీపంలోని నియమించబడిన ఆసుపత్రుల నుండి ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని పొందవలసి ఉంటుందని యతేందర్ కుమార్ తెలిపారు. పుణ్యక్షేత్రం బోర్డు వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా కూడా యాత్రికులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు సీఈఓ నితీశ్వర్ కుమార్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో 3000 మంది యాత్రికులకు వసతి కల్పించే యాత్రి నివాస్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది సరాసరి మూడు లక్షల మంది యాత్రికులు పుణ్యక్షేత్రానికి వస్తారని బోర్డు అంచనా వేస్తోంధని అన్నారు. యాత్రికుల బీమా సౌకర్యం ఈ ఏడాది రూ.3 లక్షల నుంచి 5 లక్షలకు పెరిగిందని తెలిపారు.
Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రికులకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం గుడ్ న్యూస్..‘‘యాత్రి నివాస్‌’’ నిర్మాణం

ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొంటారు. వారు ప్రతి సంవత్సరం వేసవి నెలల్లో దక్షిణ కాశ్మీర్‌లోని శ్రీ అమర్‌నాథ్‌జీ మందిరానికి అతిపెద్ద పర్వతాలను దాటుకుంటూ వెళ్తారు. అయితే COVID-19 మహమ్మారి కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో అమర్‌నాథ్ యాత్రను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019లో కూడా ఆగస్టు 5వ తేదీకి కొన్ని రోజుల ముందు కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసింది. దీంతో లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని విభజించినప్పుడు యాత్ర కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.