Thank you modiji : దండాలయ్యా మోదీజీ

పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఫన్నీ మీమ్స్, ఫొటోలను పోస్టు చేస్తూ..ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. #ThankYouModiJiChallenge తెగ ట్రెండ్ అవుతోంది.

Thank you modiji : టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియాను చురుకుగా చాలా మంది ఉపయోగిస్తున్నారు. తమకు సంబంధించిన విషయాలు..ఇతరత్రా సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తుంటారు. ఇందులో కొన్ని అంశాలు తెగ వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాను అధికారపక్షం, విపక్షాలకు చెందిన నేతలు కూడా ఉపయోగిస్తుంటారు.

Read More : Karnataka CM : ఆడియో క్లిప్‌ కలకలం: ‘జూలై 26న కర్ణాటక సీఎం మార్పు’

కొన్ని అంశాలు..ట్రెండింగ్ అవుతుంటాయి. ప్రస్తుతం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చెందిన ఓ అంశం ట్రెండింగ్ అవుతోంది. నరేంద్ర మోదీ కటౌట్ లు, ఫ్లెక్సీల ఎదుట జనాలు దండాలు పెడుతున్నారు. #ThankYouModiJiChallenge హ్యాష్ ట్యాగ్ కొత్త ట్రెండ్ ను సృష్టిస్తోంది. చాలా మంది ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. దండాలు పెడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Read More : TTDP New President: తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎన్నిక
అయితే..ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేగా మీ డౌట్. ప్రస్తుతం పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఫన్నీ మీమ్స్, ఫొటోలను పోస్టు చేస్తూ..ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఉన్న అవకాశాలను విపక్షాలు అందిపుచ్చుకుంటాయనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం #ThankYouModiJiChallengeను వాడేసుకుంటోంది. పెట్రోల్, డీజిల్ ధరలను నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజున తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు..పార్లమెంట్ కు సైకిల్ పై వచ్చారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ..వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

Read More : RC 15 : అప్పుడు యాక్టర్.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..!

ఇక పెట్రోల్, డీజిల్ ధరల విషయానికి వస్తే…ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107. 83 చేరుకోగా..డీజిల్ ధర రూ. 97.45 గా ఉంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.52 ఉండగా..డీజిల్ ధర రూ. 97.06గా ఉంది.

పెట్రోల్ ధరలు :-

న్యూఢిల్లీ రూ. 101. 84. కోల్ కతా రూ. 102.08. ముంబై రూ. 107.83. చెన్నై 102.49. గుర్ గావ్ 99.08. నోయిడా 98.90. బెంగళూరు 105.25. భువనేశ్వర్ రూ. 102.66. లక్నో రూ. 98.92

డీజిల్ ధరలు :-

న్యూఢిల్లీ రూ. 89. 87. కోల్ కతా రూ. 93.02. ముంబై రూ. 97.45. చెన్నై 94.39. గుర్ గావ్ 90.12. నోయిడా 90.23. బెంగళూరు 95.26. భువనేశ్వర్ రూ. 97.95. లక్నో రూ. 90.26.

ట్రెండింగ్ వార్తలు