Vaccine Booking : వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు..

కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సినేష‌న్ బుకింగ్‌ పై కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

Vaccine Booking : వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు..

Vaccine (1)

Updated On : August 24, 2021 / 12:22 PM IST

new policy on vaccination booking : ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది. రూపాంతరాలు మార్చుకుంటూ దాడి చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ పోయిందనుకుని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొచ్చింది. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేష‌న్ బుకింగ్‌ పై కేంద్ర ప్ర‌భుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

పౌరుల సౌల‌భ్యం కోసం మొబైల్ ఫోన్ల‌లో ఉండే వాట్సాప్ ద్వారానే టీకా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం క‌ల్పించింది. దీనికి సంబంధించి మంగళవారం కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ట్వీట్ చేశారు. వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ బుక్ చేసుకునే ప‌ద్ధ‌తి.. పౌరుల సేవ‌లో కొత్త యుగానికి తెర‌లేపింద‌ని మంత్రి తెలిపారు. ఈ విధానం వ‌ల్ల వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ మ‌రింత సులువుగా మార‌నున్నట్లు పేర్కొన్నారు.

ఫోన్ల‌లోనే చాలా సులువైన పద్ధతిలో కరోనా వ్యాక్సిన్ ను బుకింగ్ చేసుకోవ‌చ్చన్నారు. కేవ‌లం నిమిషాల్లోనే ఈ ప్ర‌క్రియ పూర్తి అవుతుంద‌ని తెలిపారు. వాట్సాప్‌లోని మైగ‌వ‌ర్న‌మెంట్ ఇండియా క‌రోనా హెల్ప్‌డెస్క్‌కు బుక్ స్లాట్ అని మెసేజ్ చేయాలి. ఆ త‌ర్వాత ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. దీంతో వ్యాక్సిన్ స్లాట్ రిజిస్ట్రేష‌న్ సులువుగా ఉంటుంద‌ని మంత్రి మ‌న్సూక్ తెలిపారు.