Goat Gave Birth : మనిషి ముఖంతో వింత జీవికి జన్మనిచ్చిన మేక

సోనాఘడ్ తాలుకా సెల్లిపేట గ్రామానికి చెందిన అజయ్ భాయ్ వాసవ రైతు. ఆయన మేకలు పెంచుకుంటూ..కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు.

Goat Gave Birth : మనిషి ముఖంతో వింత జీవికి జన్మనిచ్చిన మేక

Goat

Updated On : April 9, 2021 / 11:20 AM IST

Worshipped Like God : ప్రపంచంలో ఎన్నో అద్బుతాలు జరుగుతుంటాయి. ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకుంటుంటాయి. చిత్రవిచిత్రమైన రీతిలో, ఎవరూ నమ్మలేని వింతలు జరుగుతుంటాయి. వింత వింత ఆకారంలో జన్మిస్తుంటారు. ఇందులో జంతువులు కూడా ఉంటాయి. ఇలాగే..ఓ వింత చోటు చేసుకుంది. మనిషి ఆకారంతో ఉన్న వింత జీవికి మేక జన్మనిచ్చినట్లు వార్తు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వింత జీవిని చూసేందుక జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. దేవుడి ప్రతిరూపం అంటూ..పూజలు చేస్తున్నారు. అయితే..ఈ వింత జీవి కొద్దిసేపు మాత్రమే జీవించి ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సోనాఘడ్ తాలుకా సెల్లిపేట గ్రామానికి చెందిన అజయ్ భాయ్ వాసవ రైతు. ఆయన మేకలు పెంచుకుంటూ..కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే అతడి ఇంట్లో మేక ప్రసవించింది. ఆ మేక వింత జీవికి జన్మనివ్వడంతో అజయ్ ఆశ్చర్యపోయాడు. ఈ విషయం గ్రామమంతా పాకింది. ఇంకేముంది…అతడి ఇంటికి క్యూ కట్టారు. మనిషి ముఖాన్ని పోలి ఉండడంతో ఆ వింత జీవికి పూజలు చేయడం ప్రారంభించారు. మేకలకు ఉండే తోక దీనికి లేకపోవడం గమనార్హం. మనిషికి ఉన్నట్లుగానే..ముఖం, ముక్కు, నోరు ఉన్నాయి. నాలుగు కాళ్లు కూడా ఉన్నాయి. పది నిమిషాల పాటే జీవించిన ఈ వింత జీవి చనిపోవడంతో దానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.


Read More : Maharashtra Migrants: లాక్‌డౌన్ మొదలైంది.. వలసదారుల తిప్పలు షురూ