ఇంటి డాబా పైనే విమానం తయారు చేసిన పైలట్

మహారాష్ట్ర కు చెందిన ఒక వ్యక్తి తన ఇంటి మేడ పై భాగంలో విమానాన్ని తయారు చేశాడు. కేంద్ర పభుత్వం అనుమతితో మహారాష్ట్రకు చెందిన కెప్టెన్ అమోల్ యాదవ్ దీన్ని తయారు చేశారు. పూర్తిగా భారత దేశంలోనే విమానం తయారు చేయాలనే తన రెండు దశాబ్దాల కల నెరవేరిందని ఆయన ఆనందంగా పేర్కోన్నారు.
ఇందులో ఆరుగురు కూర్చుని ప్రయాణం చేయవచ్చు. ఓ టెక్నీషియన్ సాయంతో దీనిపై తొలి దశలో నిర్వహించిన పరీక్షలు విజయవంతం అయ్యాయని అమోల్ యాదవ్ తెలిపారు. అందులో భాగంగా తక్కువ ఎత్తులో విమానాన్ని గాలిలో నడిపారు. అది విజయవంతం కావటంతో రెండో దశ పరీక్షలో భాగంగా 2వేల అడుగుల ఎత్తులో ఎగరనున్నట్లు వివరించారు.
తొలి దశ పరీక్షల కోసం కేంద్ర పౌర విమానాయాన డైరెక్టర్ జనరల్ డీజీసీఏ గత ఏడాది అనుమతిచ్చింది విమానంపై పరీక్షల కోసం భారీగా ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంటుందని…. కుటుంబ సభ్యుల సహకారంతో నిధులు సమకూర్చుకున్నట్లు అమోల్ వివరించారు.