Single Judge Commission issued summons to Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తోన్న సమయంలో… ఆయనకు కేసులు పలకరిస్తున్నాయి. తాజాగా తూత్తుకుడి కేసు విచారణ జరుపుతోన్న సింగిల్ జడ్జి కమిషన్ రజినీకాంత్‌కు సమన్లు జారీ చేసింది. జనవరి 19 లోపు సమాధానం ఇవ్వాలని ఆయన్ని ఆదేశించాయి.
2018 మేలో తూత్తుకుడిలోని స్టెరిలైట్ ఫ్యాక్టరీలో ఫైరింగ్ జరిగింది. ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిడైర్ట్ జస్టిస్ అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. అయితే.. అప్పటి ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని… దీని వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు సూపర్‌స్టార్.
దీంతో.. ఆయన వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకున్న కమిషన్… ఘటనకు సంబంధించి రజనీకాంత్ దగ్గరున్న సమాచారం అందించాల్సిందిగా సమన్లు జారీ చేశాయి. జనవరి 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించాయి. ఇప్పుడే కాదు గతంలో కూడా రజనీకాంత్ సమన్లు అందుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా కమిషన్ నోటీసులు పంపింది. అయితే రజనీకాంత్ మాత్రం విచారణకు హాజరుకాలేదు.