Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల ముందుగానే

రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తన్నాయి. నైరుతి రాకతో భానుడి భగభగల నుంచి రిలీఫ్ లభించనుంది.

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల ముందుగానే

Kerala Monsoon

Updated On : May 29, 2022 / 2:23 PM IST

southwest monsoon : ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి. షెడ్యూల్‌ కంటే మూడు రోజులకు ముందుగానే నైరుతి కేరళలో ప్రవేశించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ప్రతి యేటా జూన్ 1కి నైరుతి రుతుపనాలు కేరళకు చేరుకుంటాయి. అయితే ఈసారి మాత్రం నైరుతి కేరళను మూడు రోజుల ముందే పలకరించింది.

మే 20 వరకు మందకోడిగా కదలిన మాన్‌సూన్ ఆ తర్వాత వేగంగా విస్తరించడం మొదలు పెట్టాయి. నైరుతి ప్రభావంతో ఇప్పటికే కేరళతో పాటు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు… తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తన్నాయి. నైరుతి రాకతో భానుడి భగభగల నుంచి రిలీఫ్ లభించనుంది.

Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. రెండు, మూడు రోజుల్లో కేర‌ళ‌లోకి నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.