Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు

జూన్ 5 నుంచి 10వ తేదీ మ‌ధ్యలో నైరుతి రుతుప‌వ‌నాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృత‌మై ఉండ‌నుంది. ఓ మోస్తరు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు

Rains

rain forecast : రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. రెండు, మూడు రోజుల్లో కేర‌ళ‌లోకి నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

ఇదే స‌మ‌యంలో అరేబియ‌న్ స‌ముద్రం, ల‌క్ష‌ద్వీప్‌లోని ప‌లు ప్రాంతాల‌కు నైరుతి రుతు ప‌వ‌నాలు ప్ర‌వేశించే అవ‌కాశం ఉంది. జూన్ 5 నుంచి 10వ తేదీ మ‌ధ్యలో నైరుతి రుతుప‌వ‌నాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృత‌మై ఉండ‌నుంది. ఓ మోస్తరు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

Telangana Rains : ఈ ఏడాది సమృధ్ధిగా వర్షాలు-వ్యవసాయానికి అనుకూలం

మరో రెండు మూడ్రోజుల్లో.. నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈనెల 27నే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసినా.. మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని తాజాగా వెల్లడించింది వాతావరణ శాఖ. జూన్ మొదటి వారంలో నెమ్మదిగా పురోగమిస్తాయని వెల్లడించింది.

తాజా వాతావరణ సూచనల ప్రకారం, దక్షిణ అరేబియా సముద్రం మీదుగా దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు బలపడి లోతుగా మారాయి. ఉపగ్రహాల చిత్రాల ప్రకారం, కేరళ తీరం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఆకాశం మేఘావృతమైంది.