Bengaluru
Bengaluru : బెంగళూరుకి సంబంధించిన ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. చేసే వృత్తిని విడిచిపెట్టి పొట్టకూటి కోసం రకరకాల పనులు చేసే వ్యక్తుల గురించి వింటూ ఉంటాం. తాజాగా ఒక ఆర్కిటెక్ట్ వడా పావ్ వ్యాపారిగా మారిన స్టోరి వైరల్ అవుతోంది.
Terrifying Video: తీర్పు చదువుతోన్న మహిళా జడ్జిపైకి ఎగిరి.. దాడి చేసిన నిందితుడు
చేసే పనిలో సంతృప్తి, సరైన ఆదాయం దొరకనపుడు కొంచెం కష్టమైనా ఇష్టమైన పనులు చేయవచ్చును. తమ సొంత ఆలోచనలతో వ్యాపారాలు మొదలుపెట్టవచ్చు. బెంగళూరు లాంటి సిటీలో ఇటీవల కాలంలో అనేక ఆసక్తికరమైన కథనాలు వెలుగు చూస్తున్నాయి. బతుకు తెరువు కోసం నచ్చిన పనిని ఎంచుకుంటున్నారు. బెంగళూరులో ఒకరి దగ్గర పని చేయడం ఇష్టం లేక లోకేష్ అనే ఉబెర్ డ్రైవర్ ఓలాకు పోటీగా సొంత యాప్‌ను ప్రారంభించడం.. అతని యాప్‌లో 600 మంది కంటే డ్రైవర్లు ఉండటం వంటి కథనాలు చూసాం. తాజాగా @imvishwas_rawat అనే ట్విట్టర్ యూజర్ ఆర్కిటెక్ట్‌గా ఉన్న ఓ వ్యక్తి వడాపావ్ వ్యాపారిగా మారిన విషయాన్ని షేర్ చేసారు.
విశ్వాస్ షేర్ చేసిన పోస్టులో ఒక వ్యక్తి ‘నేను సూపర్ హీరోను కాదు.. వడ పావ్‌తో రోజు ఆదా చేసుకోగలను’ అని రాసి ఉన్న ప్లకార్డుతో నిలబడి ఉన్నారు. అతని ఫోటోకి విశ్వాస్ ‘జుడియో, హెచెఎస్‌ఆర్‌లో ఓ వ్యక్తిని కలిశాను. షాపింగ్, వడ పావ్ ఆనందం కలగలిసిన రోజు. మాజీ ఆర్కిటెక్ట్ కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలిపెట్టి వడా పావ్ వ్యాపారం చేస్తున్నాడు.. బెంగళూరులో జీవితం రోలర్ కోస్టర్ రైడ్‌లా కొత్తగా థ్రిల్లింగ్‌గా ఉంటుంది’ అని కన్ క్లూడ్ చేసాడు. ఈ పోస్టు వైరల్ అవుతోంది.
Met the guy at Zudio, HSR. A day made with a mix of shopping & vadapav bliss! ?
An ex-architect, he left the corporate world to revive vadapav’s complete meal charm. Living in Bengaluru is a thrilling ride on the innovation rollercoaster!
@peakbengaluru pic.twitter.com/T0tOxEJ1EK
— Vishwas ?? (@imvishwas_rawat) January 2, 2024