zomato Food Delivery Boy : గుర్రంపై ఆర్డర్లు డెలివరీ చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్.. రూ.10వేల సహాయం చేసిన ఎంబీటీ ప్రతినిధి.. వీడియో వైరల్

గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ చేసిన జొమాటో బాయ్ కి మజ్లిస్ బచావో తహ్రీక్ (ఎంబీటీ) పార్టీ ప్రతినిధి, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ అంజెద్ ఉల్లా ఖాన్ రూ.10వేలు సహాయం అందించారు.

zomato Food Delivery Boy : గుర్రంపై ఆర్డర్లు డెలివరీ చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్.. రూ.10వేల సహాయం చేసిన ఎంబీటీ ప్రతినిధి.. వీడియో వైరల్

zomato Food Delivery Boy

MBT party Amjed Ullah Khan : హైదరాబాద్ లో జొమాటోకు చెందిన ఓ డెలివరీ బాయ్.. ఆర్డర్లను గుర్రంపై వెళ్లి డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతను గుర్రంపై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేయడానికి ఓ కారణం ఉంది. పెట్రోల్ కొరత వల్ల తలెత్తిన ఇబ్బందులు కారణంగా డెలివరీ బాయ్ గుర్రంపై వెళ్లి కస్టమర్లకు ఆర్డర్లు అందించాడు.

Also Read : Food Delivery Boy : పెట్రోల్ కష్టాలు.. గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ ఇచ్చిన జొమాటో బాయ్.. వీడియో వైరల్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హీట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యాజమానులు, డైవర్లు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్ సరఫరా నిలిచిపోయి హైదరాబాద్ లో పలుప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. కొన్ని బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా క్యూ కట్టారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. దీంతో ప్రతీరోజూ బైక్ పై వెళ్లి ఆర్డర్ డెలివరీ చేసే జొమాటో డెలివరీ బాయ్.. పెట్రోల్ కొరత కారణంగా ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అనుకున్న సమయానికి కస్టమర్ కు ఆర్డర్ డెలివరీ చేయాలన్న ఉద్దేశంతో గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ చేశాడు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ గా మారింది.

Also Read : South Africa Vs India 2nd Test Updates : 122 ఏళ్లలో ఇదే తొలిసారి.. కేప్‌టౌన్‌ టెస్టులో అనేక రికార్డులు.. రోహిత్ శర్మ ధోనీ సరన నిలుస్తాడా?

గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ చేసిన జొమాటో బాయ్ కి మజ్లిస్ బచావో తహ్రీక్ (ఎంబీటీ) పార్టీ ప్రతినిధి, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ అంజెద్ ఉల్లా ఖాన్ రూ.10వేలు సహాయం అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో గుర్రంపై వచ్చిన జొమాటో బాయ్ కు అంజెద్ ఉల్లా ఖాన్ పదివేల నగదు ఇవ్వడం చూడొచ్చు.