Corona Cases : భారత్ లో కొత్తగా 8,865 కరోనా కేసులు..197 మరణాలు

భారత్ లో కొత్తగా 8,865 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 197 మరణాలు రిజస్టర్ అయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Corona Cases : భారత్ లో కొత్తగా 8,865 కరోనా కేసులు..197 మరణాలు

India Corona

Updated On : November 16, 2021 / 10:22 AM IST

corona cases and deaths : భారత్ లో కొత్తగా 8,865 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 197 మరణాలు రిజస్టర్ అయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో 287 రోజల కనిష్టానికి కరోనా కొత్త కేసులు చేరాయి.

దేశవ్యాప్తంగా కరోనా యక్టీవ్ కేసులు 525 రోజుల కనిష్టానికి చేరాయి. ప్రస్తుతం దేశంలో 1,30,793 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 0.38 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 3,44,56,401 కేసులు, 4,63,852 మరణాలు నమోదు అయ్యాయి.

Singapore Government : భారతీయులకు సింగపూర్ ప్రభుత్వం గుడ్ న్యూస్..టీకా రెండు డోసులు తీసుకుంటే దేశంలోకి అనుమతి

దేశంలో మార్చి 2020 తరువాత భారీగా రికవరీ కేసుల శాతం పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.27 శాతంగా ఉంది. నిన్న 11,971 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,38,61,756 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మరోవైపు భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ 304 రోజులుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 112.97 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. నిన్న 59,75,469 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 112,97,84,045 డోసుల టీకాలు అందజేశారు.