Third Covid wave: కరోనా మూడో వేవ్.. రోజుకు ఆరు లక్షల కేసులు రావచ్చు.. నిపుణుల సూచనలు ఇవే!

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక సంస్థ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సెప్టెంబర్‌లో కరోనా థర్డ్ వేవ్ రావచ్చునని రిపోర్ట్ ఇచ్చింది.

Third Covid wave: కరోనా మూడో వేవ్.. రోజుకు ఆరు లక్షల కేసులు రావచ్చు.. నిపుణుల సూచనలు ఇవే!

Vaccinated People Can Spread Delta Covid Variant, Have Similar Viral Load As Unvaccinated

Updated On : August 24, 2021 / 6:52 AM IST

Third Covid wave: హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక సంస్థ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సెప్టెంబర్‌లో కరోనా థర్డ్ వేవ్ రావచ్చునని రిపోర్ట్ ఇచ్చింది. అక్టోబర్‌లో మూడో వేవ్ కరోనా పీక్ స్టేజ్ సంభవించవచ్చు అని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వేగాన్ని వేగవంతం చేయాలని కమిటీ సూచనలు చేసింది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(ఎన్‌ఐడిఎమ్) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ పిల్లలు కూడా పెద్దల మాదిరిగానే ప్రమాదంలో ఉన్నారని నివేదిక ఇచ్చారు. పెద్ద సంఖ్యలో పిల్లలు వ్యాధి బారిన పడినప్పుడు పీడియాట్రిక్ ఆసుపత్రులు, వైద్యులు మరియు వెంటిలేటర్లు, అంబులెన్సులు అందుబాటులో ఉండకపోవచ్చునని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చెయ్యాలని సూచనలు చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించిన ఈ నివేదికలో భారతదేశంలో కేవలం 7.6 శాతం(10.4 కోట్లు) మందికి మాత్రమే పూర్తిగా వ్యాధి నిరోధక వ్యాక్సిన్‌లు వేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ రేటు పెంచకపోతే, మహమ్మారి మూడో వేవ్ సమయంలో దేశం రోజుకు ఆరు లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

మూడో వేవ్ ఎప్పటివరకు ఉండొచ్చు:
నివేదిక ప్రకారం, భారతదేశంలో మూడో వేవ్ కరోనా దేశంలో 18ఏళ్ల నుంచి 45ఏళ్ల మధ్యలో ఆఖరి వ్యక్తికి వ్యక్తికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌లు వేసేవరకు రోగనిరోధక శక్తి విస్తరించే వరకు, కేసులు పెరుగుతూనే ఉంటాయని ఎపిడెమియాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు.

రోగనిరోధక శక్తి అభివృద్ధి అవసరం:
80శాతం నుంచి 90 శాతం జనాభా రోగనిరోధక శక్తిని పెంచుకున్నప్పుడు మాత్రమే పెద్ద ఎత్తున రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసుకుంటేనే కరోనా క్షీణత లక్ష్యాన్ని సాధించవచ్చని నివేదిక స్పష్టం చేసింది. నివేదిక ప్రకారం, జనాభాలో 67 శాతం మంది వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటే (కొందరు వైరస్ ద్వారా, మిగిలిన వారు వ్యాక్సిన్ ద్వారా), అప్పుడు కూడా కరోనా మందగించవచ్చునని వెల్లడించారు.

కొత్త వేరియంట్‌తో కష్టమే..
SARS COV-2 కొత్త మరియు మరిన్ని ఇన్ఫెక్షియస్ వేరియంట్‌లు, కొత్త డెల్టా వేరియంట్లు సంక్లిష్టంగా మారిందని నిపుణులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో ప్రజలు వ్యాక్సిన్‌లను వేయించుకున్నా కూడా కొత్త వేరియంట్ల ద్వారా కరోనా సోకుతుందని నివేదిక చెబుతోంది.