SC/ST Act: కాళ్లపై పడి క్షమాపణ చెప్పాలని దళితులకు ఊరి పంచాయితీ తీర్పు

గ్రామంలో జరిగిన గొడవకు గానూ గ్రామస్థులందరి ముందు క్షమాపణలు చెప్పాలని ముగ్గురు దళితులకు శిక్ష విధించింది పంచాయితీ. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో

SC/ST Act: కాళ్లపై పడి క్షమాపణ చెప్పాలని దళితులకు ఊరి పంచాయితీ తీర్పు

Three Dalit Men Forced To Fall At Feet Of Panchayat Case Booked Under Sc St Act

Updated On : May 16, 2021 / 11:09 AM IST

SC/ST Act: గ్రామంలో జరిగిన గొడవకు గానూ గ్రామస్థులందరి ముందు క్షమాపణలు చెప్పాలని ముగ్గురు దళితులకు శిక్ష విధించింది పంచాయితీ. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరువెన్నైనల్లూర్ సమీపంలోని ఒట్టనందాల్ పంచాయతీ పరిధిలోని దళిత్ కాలనీ సభ్యులకు జరిగింది ఈ పరాభవం.

రీసెంట్ గా వారు ఓ మ్యూజిక్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. మహమ్మారి సమయంలో ఇటువంటి కార్యక్రమాలు జరుపుతున్నారంటూ హిందువులు పోలీస్ కంప్లైంట్ చేశారు. పోలీసాఫీసర్ అక్కడకు వచ్చి టీంను మందలించి మైకులు, స్పీకర్లు సీజ్ చేశారు. కాసేపటి తర్వాత వాటిని తిరిగి ఇచ్చేశారు.

ఆ తర్వాత కేసు పెట్టిన గ్రూపుపై వారంతా కలిసి వాదనకు దిగారు. అలా ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. ఎవరికి వాళ్లు కాంప్రమైజ్ అయి వెళ్లిపోయారు. అయినప్పటికీ గొడవను పంచాయితీ పరిష్కరిస్తుందని అందరినీ పిలిపించారు గ్రామ పెద్దలు. ఘటన పట్ల తమకు క్షమాపణ చెప్పాలని ముగ్గురు వృద్ధ దళితులకు ఆదేశాలిచ్చారు.

సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.రాధాకృష్ణన్ ఆదేశం ప్రకారం.. దీనికి కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని వారిపై కేసు బుక్ చేశారు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) చట్టం కింద వారిపై కేసులు బుక్ చేశారు.