Omicron Cases In India : ఒక్కరోజే 3 కేసులు.. దేశంలో 26కి పెరిగిన ఒమిక్రాన్ బాధితులు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. భారత్ ను కలవరపెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరిగింది.

Omicron Cases In India

Omicron Cases In India : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. భారత్ ను కలవరపెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరిగింది. ఒక్క రోజే మూడు ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. టాంజానియా నుంచి ముంబైలోని ధారావికి వచ్చిన 49ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 4న అతడు టాంజానియా నుంచి వచ్చాడు.

ప్రస్తుతం అతడు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు. కాగా, ఈ రోజు ఉదయం గుజరాత్ లో 2 కేసులు వచ్చాయి. దీంతో భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 26కి పెరిగింది. అయితే, ఒమిక్రాన్ బాధితుల్లో ఒక్కరిలోనూ తీవ్ర లక్షణాలు లేకపోవడం ఊరటనిచ్చే అంశం.

Facebook Profile Trick : మీ FB ప్రొఫైల్ ఎవరు చూశారో ఇట్టే తెలుసుకోవచ్చు!..

కరోనా మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో వేరియంట్‌ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో… కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది.

Tecno Spark 8T స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరాతో.. బడ్జెట్ ధరలో!

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి దడ పుట్టిస్తోంది. ఇదే తరహాలో వ్యాప్తి చెందితే ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య పెరుగుతూ మరోసారి దేశాన్ని అతలాకుతలం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వైరస్‌ వ్యాప్తిని చూస్తుంటే థర్డ్‌ వేవ్‌ తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 57 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది.

Cyber Fraud : గూగుల్‌‌లో సెర్చ్ చేసి రూ. 19 వేలు పొగొట్టుకొన్న యువతి