Ayodhya Ram Temple : అయోధ్య రామాలయంలో పూజారుల నియామకానికి 3వేల దరఖాస్తులు

శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య నగరంలోని రామాలయంలో పూజారుల నియామకానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22వతేదీన ఆలయ గర్భగుడిలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు సిద్ధమవుతోంది.....

Ayodhya Ram Temple : అయోధ్య రామాలయంలో పూజారుల నియామకానికి 3వేల దరఖాస్తులు

Ayodhya Ram Temple

Updated On : January 8, 2024 / 12:25 PM IST

Ayodhya Ram Temple : శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య నగరంలోని రామాలయంలో పూజారుల నియామకానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22వతేదీన ఆలయ గర్భగుడిలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు సిద్ధమవుతోంది. దీంతో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పూజారుల నియామకంతో సహా ఇతర ప్రక్రియలకు శ్రీకారం చుట్టింది.

పూజారుల పోస్టులకు ఇంటర్వ్యూలు

సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఆలయాన్ని ప్రజల దర్శనం కోసం తెరవనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించిన అర్చకుల ఖాళీల భర్తీ ప్రకటనకు ప్రతిస్పందనగా మూడువేల మంది అభ్యర్థులు పూజారి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ట్రస్ట్ కు వచ్చిన 3వేలమంది దరఖాస్తుదారుల్లో 200 మందిని ఇంటర్వ్యూ కోసం మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసినట్లు ఆలయవర్గాలు తెలిపాయి.

కరసేవకపురంలో అభ్యర్థులకు శిక్షణ

బృందావన్‌కు చెందిన ప్రముఖ బోధకుడు జయకాంత్ మిశ్రా,అయోధ్యకు చెందిన ఇద్దరు మహంతులు మిథిలేష్ నందిని శరణ్, సత్యనారాయణ దాస్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఆలయంలోని కరసేవకపురంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ఇంటర్య్యూల అనంతరం ట్రస్ట్ చివరకు 20 మంది అభ్యర్థులను పూజారుల ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తుంది.

ALSO READ : Telangana Assembly Election 2023 : కాంగ్రెస్ కట్టడికి బీఆర్ఎస్ మునుగోడు ఫార్ములా?

ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలల రెసిడెన్షియల్ శిక్షణ తర్వాత రామజన్మభూమి కాంప్లెక్స్‌లోని వివిధ పోస్టుల్లో నియమిస్తారు. శిక్షణ అనంతరం పూజారులకు సర్టిఫికెట్లు జారీ చేసి భవిష్యత్ లో వారిని రామాలయం అర్చకుల పోస్టుల్లో భర్తీ చేస్తామని ఆలయట్రస్టు సభ్యుడు చెప్పారు.నిపుణుల ప్యానెల్ షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను సంధ్యా వందనం వంటి వివిధ పూజలు, శ్రీరాముని ఆరాధనకు సంబంధించిన ఇతర పూజల పనితీరు, ఆచారాలపై ఇంటర్వ్యూ చేస్తోందని ట్రస్ట్ సభ్యుడు తెలిపారు.

ALSO READ : Australian Deputy PM : ఢిల్లీ వీధుల్లో నింబూపానీ తాగిన రిచర్డ్ మార్లెస్…వీడియో వైరల్

పూజారుల పోస్టుల భర్తీ అభ్యర్థులకు అగ్రశ్రేణి సాధువులు తయారుచేసిన మతపరమైన పాఠ్యాంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు నెలవారీ రూ.2,000 స్టైఫండ్‌తో పాటు భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని రామాలయం ట్రస్టు వివరించింది.