Thugs Attacked Pregnant Woman : ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ఎనిమిది నెలల గర్భిణీపై దుండగులు దాడి

ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ లో దారుణం జరిగింది. నిండు గర్భిణీపై దుండుగులు దాడికి పాల్పడ్డారు. ఎనిమిది నెలల గర్బిణీతోపాటు అతని భర్తపై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో గర్బిణీతోపాటు ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.

Thugs Attacked Pregnant Woman : ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ఎనిమిది నెలల గర్భిణీపై దుండగులు దాడి

thugs attacked pregnant

Updated On : December 17, 2022 / 3:03 PM IST

Thugs Attacked Pregnant Woman : ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ లో దారుణం జరిగింది. నిండు గర్భిణీపై దుండుగులు దాడికి పాల్పడ్డారు. ఎనిమిది నెలల గర్బిణీతోపాటు అతని భర్తపై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో గర్బిణీతోపాటు ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సందీప్, ఉపాసన దంపతులు జలౌన్ లో నివసిస్తున్నారు.

అయితే ఉపాసన ఎనిమిది నెలల గర్భిణీ. ఈ నేపథ్యంలో వారి ఇంట్లో ఉంటున్న ఓ వ్యక్తి కోసం ముగ్గురు దుండుగుల వెళ్లారు. అతను ఎక్కడంటూ సందీప్, ఉసాసను ప్రశ్నించారు. వారు తమకు తెలియదని చెప్పడంతో ముగ్గురు దుండగులు.. సందీప్, గర్భిణీతో ఉన్న ఉపాసనపై తీవ్రంగా దాడి చేశారు.

Three killed : చేతబడి చేశారన్న నెపంతో గర్భిణీ సహా ముగ్గురి హత్య

ఈ దాడి ఘటనను స్థానికులు కెమెరాల్లో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు రవీంద్ర, మన్మోహన్, ఆయన కుమారుడు ఆదేశ్ ను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.