Time Bank in Dehradun : డెహ్రడూన్‌లో ‘టైమ్ బ్యాంక్’.. వృద్ధులకు టైమ్ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ

ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా పెద్దగా పట్టించుకునే వారు కనపడటం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీ బిజీ. వారితో మాట్లాడే వారు లేక జీవిత చరమాంకంలో దిగులుతో జీవించేవారున్నారు. అలాంటి వారి కోసం డెహ్రాడూన్‌లో 'టైమ్ బ్యాంక్' స్ధాపించింది ఒక సామాజిక సంస్థ. పెద్దలకు సమయాన్ని కేటాయించడమే ఈ సంస్థ పని. చాలామంది ఇప్పటికే సభ్యులుగా చేరి వారికి సేవలు అందిస్తున్నారు.

Time Bank in Dehradun

Time Bank in Dehradun : తెల్లారి లేస్తే ఎవరి ఉద్యోగాలతో వారు బిజీ. ఉదయాన్నే బయటకు వెళ్లి ఏ రాత్రికో చేరతారు. ఇక ఇంట్లో ఉన్న పెద్దవారిని పలకరించేవారు ఎంతమంది ఉన్నారు. కొంతమంది విదేశాలకు వెళ్లిపోయి తమ పేరెంట్స్‌ని ఒంటరిగా వదిలేస్తున్నారు. డబ్బులు పంపించేస్తే బాధ్యతలు తీరిపోతుందనుకోవడం పొరపాటు. వయసు మీద పడ్డాక వారికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కనీసం వారి కష్టసుఖాలు పంచుకునేవారు లేక చాలామంది వృద్ధులు దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వారితో సమయాన్ని పంచుకోవడానికి ‘టైమ్ బ్యాంక్’ అనే సంస్థ ప్రారంభమైంది.

Telangana : తనకు తానే చితి పేర్చుకుని నిప్పు పెట్టుకుని ప్రాణాలు తీసుకున్నవృద్ధుడు.. పట్టెడు మెతుకుల కోసం సొంతూరు వదల్లేక మంటల్లో కాలిపోయిన దీనగాథ..

డెహ్రాడూన్‌లో ఓ సామాజిక సంస్థ ‘టైమ్ బ్యాంక్’ అనే సంస్థను ప్రారంభించింది. కేవలం వృద్ధులకు సమయం కేటియించడమే లక్ష్యంగా ఈ సంస్థను స్ధాపించారు. ఈ సంస్థను US బేస్డ్ MNCలో సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల రోహిత్ మామ్‌గైన్ స్ధాపించారు. దేశంలోనే మొదటిసారిగా ప్రారంభమైన ఈ టైమ్ బ్యాంక్‌లో వృద్ధులతో తమ సమయాన్ని పంచుకోవడానికి ఆసక్తి చూపేవారు ఎవరైనా పోలీస్ వెరిఫికేషన్ తరువాత సభ్యులుగా చేరవచ్చునట. వృద్ధులతో సమయాన్ని గడపవచ్చు. ఒంటరిగా ఉండే వారు ముఖ్యంగా తమ ఆరోగ్య అవసరాల కోసం ఇతరులపై ఆధారపడుతుంటారు. అలాంటి వారికి వాలంటీర్‌గా సాయం అదించవచ్చు. వాలంటీర్లు వృద్ధులతో గడిపే ప్రతి గంట కూడా వారి ఖాతాలో నమోదు చేస్తారట. ఇప్పటికే ఈ బ్యాంక్‌లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న 300 మంది వాలంటీర్లు టైం బ్యాంక్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారట.

95-year-old man playing dhol : పెళ్లిలో డోలు వాయించిన వృద్ధుడు.. కన్నీరు పెట్టుకున్న నటులు

డెహ్రూడూన్ వసంత్ విహార్ ప్రాంతంలో ఉండే 81 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఈ టైమ్ బ్యాంక్‌ను సందర్శించారు. టైమ్ బ్యాంక్ ‘వృద్ధులకు ఆశాకిరణం’ లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉండే తమ వయసు వారికి వాలంటీర్లు పంచే చొరవతో ఆ ఒంటరితనం పోతుందని చెప్పారు. ఈ టైమ్ బ్యాంక్ సేవలు ఇతర సిటీల్లో కూడా అమలు చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము అని ఆ పెద్దాయన చెప్పడం విశేషం.  నిజంగా ఈ టైమ్ బ్యాంక్ వృద్ధులకి వరమనే చెప్పాలి. ఆ స్వచ్ఛంద సంస్థ సేవలకు సలాం చెప్పాలి.