Karnataka-Tamil Nadu: 5 హామీల అమలుకు అన్ని కోట్లు ఎలా వస్తాయి? 2 వేల నోట్లూ ఉండవు కదా?: బీజేపీ

ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్న విషయాన్ని, సిద్ధరామయ్య హామీలు అమలు చేస్తామని చెప్పిన విషయానికి లింకు పెడుతూ అన్నమలై సెటైర్లు వేశారు.

Annamalai: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections 2023) ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై ఇప్పుడు దృష్టి పెట్టింది. తాము చెప్పింది చేస్తామని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉంది. కర్ణాటకలో 5 పథకాలు తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనిపై కేబినెట్ లోనూ చర్చించి, వాటి రూపకల్పనకు సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఇవాళే ఆదేశాలు ఇచ్చారు. గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి, శక్తి పథకాల అమలుకు ఏడాదికి దాదాపు రూ.50,000 కోట్లు ఖర్చు అవుతాయని సిద్ధరామయ్య అన్నారు. అయితే, వాటి అమలుకు ఏడాదికి రూ.65,000 కోట్లు ఖర్చు అవుతాయని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై అంటున్నారు.

అంతేగాక, రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంటున్న విషయాన్ని, సిద్ధరామయ్య హామీలు అమలు చేస్తామని చెప్పిన విషయానికి లింకు పెడుతూ అన్నమలై సెటైర్లు వేశారు.

చెన్నైలో ఇవాళ అన్నమలై మీడియాతో మాట్లాడుతూ… ” ప్రజా తీర్పుతో సీఎం అయినందుకు సిద్ధరామయ్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆ 5 హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు ఎక్కడివి? ఏడాదికి దాదాపు రూ.65,000 కోట్లు ఖర్చు అవుతాయి.

ఇకపై రూ.2 వేల నోట్ల కట్టలను బ్యాగులో దాచుకునే అవకాశం కూడా ఉండదు కదా? వచ్చే సెప్టెంబరు నాటికే వాటిని ఆర్బీఐ ఉపసంహరించుకోనుంది” అని వ్యంగ్యంగా చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రూ.2 వేట నోట్ల ఉపసంహరణపై చేసిన వ్యాఖ్యలపై అన్నమలై స్పందించారు. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో రూ.2 వేల నోట్లను వాడలేరని, తాను స్టాలిన్ బాధను అర్థం చేసుకోగలనని ఎద్దేవా చేశారు.

Karnataka: ఆ 5 హామీల అమలుకు సిద్ధరామయ్య కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ఏమిటా హామీలు? ఎన్ని కోట్లాది రూపాయలు ఖర్చవుతాయో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు