Dhanteras Gold Prices Huge Hike
Gold Price Today : పసిడి ప్రేమికులకు కొద్దిగా ఊరట. సోమవారం పరుగులు పెట్టిన బంగారం ధర ఈ రోజు మాత్రం నిలకడగా ఉంది. ముంబైలో మాత్రం బంగారం ధర రూ.810 రూపాయలు పెరిగింది. మిగతా నగరాల్లో స్థిరంగా కొనసాగుతుంది. కార్తీకమాసం తర్వాత బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ వెండిధరలు మాత్రం పరుగులు పెడుతున్నాయి.
చదవండి : Gold Price Today : భారీగా పెరిగిన బంగారం ధరలు.. మూడు నెలల గరిష్ఠానికి జంప్
వెండి ధర రూ.400 పెరిగింది. మంగళవారం పెరిగిన ధరతో కేజీ వెండి ధర రూ.69,100కు చేరింది. వెండి పట్టీలు, కడియాలు కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.06 శాతం ఎగసింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1827 డాలర్లకు చేరింది.
చదవండి : Gold Prices Today : తగ్గిన బంగారం ధరలు
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలను ఓ సారి పరిశీలిద్దాం
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,560గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,030గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,420 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,570 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,210 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210గా ఉంది.
చదవండి : Gold Rates: పండక్కి ముందే తగ్గిన బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,210గా ఉంది.